ఆంధ్రప్రదేశ్‌

రేపు విశాఖలో బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 8: బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ ప్రాధాన్యత తదితర సమస్యలు చర్చించేందుకు రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఈ ఆత్మీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా కలుషితం చేశారని ఆరోపించారు. బ్రాహ్మణులకు ఎంతో మేలుచేసినట్టు గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, ఐవైఆర్‌కు పదవి తదితర అంశాలను పూర్తిగా తన రాజకీయాలకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. కృష్ణారావు, చెంగవల్లి వెంకట్‌ల నేతృత్వంలో ప్రారంభమైన బ్రాహ్మణ కార్పొరేషన్ విధాన పరంగా కొనసాగుతున్న తరుణంలో కొన్ని రాజకీయ కారణాలతో కృష్ణారావును పదవీచ్చుతుని చేశారన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు తొలి దశలో రూ.500 కోట్ల నిధులు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, కేవలం రూ.175 కోట్లతో సరిపెట్టిందన్నారు. వీటిని కూడా సమర్ధవంతంగా ఖర్చు చేయలేని స్థితిలో కార్పొరేషన్ చతికిలపడిందన్నారు. సమావేశానికి బ్రాహ్మణ వర్గానికి చెందిన విశ్రాంత అధికారులు, మేథావులు, బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొంటారన్నారు.
మోసగించేందుకే: ఆనంద్ సూర్య
విజయవాడ: బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పేద బ్రాహ్మణులకు సాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం కృషి చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ కల్లబొల్లి కబుర్లతో బ్రాహ్మణులను, అర్చకులను, పురోహితులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం, చోడవరంల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతికి బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి అసలు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. ఈ నాలుగు సంవత్సరాల టీడీపీ పాలనలో బ్రాహ్మణులకు, అర్చకులకు అనేక రకాలైన సంక్షేమ పథకాలు అందాయన్నారు. తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన 2017-18 సంవత్సరానికి 46,870 మందికి రూ. 62.23 కోట్లు లబ్ధి చేకూరిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 30,544 మందికి రూ. 24.08 కోట్లు ఇప్పటికే లబ్ధి చేకూరిందన్నారు. తన హయాంలో ఇప్పటికే 77,416 మందికి రూ. 87.11 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.