ఆంధ్రప్రదేశ్‌

విశాఖ భూ కుంభకోణంలో దోషులను శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: విశాఖ జిల్లాలో 186 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేసిన కుంభకోణంలో దోషులను శిక్షించి భూములు స్వాధీనం చేసుకోవాలని సీపీఎం (ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే భారీ అవినీతికి పాల్పడి భూములను కాజేయడం సిగ్గుచేటన్నారు. ఈ కుంభకోణంలో సిట్ అదుపులోకి తీసుకున్న మాజీ రెవెన్యూ అధికారులను కాపాడడానికి అధికార పార్టీకి చెందిన వారే ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తంగా ఉన్న భూముల రికార్డులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి అక్రమాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని మధు డిమాండ్ చేశారు.