ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరాతి, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన లేఖ రాసారు. ‘సన్‌రైజ్ స్టేట్’గా ఏపీని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కలల సాకారానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. గత శుక్రవారం తిరుపతిలో జరిగిన క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు చేసిన అతిథి మర్యాదలు, తన పట్ల చూపిన ఆదరాభిమానాలకు ముగ్ధుడినయ్యానని ఆ లేఖలో ఉటంకించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్న సీఎంకు తాము అన్నివేళలా అండగా ఉంటామని తెలిపారు.