ఆంధ్రప్రదేశ్‌

జ్వరాలపై కదిలిన యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో జ్వరాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా కదులుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రోజూ రాష్ట్రంలో జ్వరాల పరిస్థితి ఎలా ఉందనే అంశం మీద ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తున్నారు. సోమవారానికల్లా పరిస్థితులు అదుపులోకి రావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు చురుగ్గా కదులుతున్నారు. రాష్ట్ర మంతటా అధికారులు జ్వరాలు అరికట్టడంపై దృష్టి సారించారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఊభయగోపావరి, గుంటూరు, కృష్ణాజిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున చేపడుతున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది జ్వర ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో జ్వరాలు, పారిశుద్ధ్య పరిస్థితులను అరికట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్‌లో, రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ కేంద్రంలో ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రాష్ట్రంలో జ్వరాలు, పారిశుద్ధ్యం సమస్యలకు సంబంధించి పరిష్కార వేదికకు గత రెండు రోజుల్లో మొత్తం 207 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఇప్పటకే 20 సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు. మరో 187 సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయి.