ఆంధ్రప్రదేశ్‌

మోదీ, అమిత్‌షా కుటిల రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కుటిల రాజకీయం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ధ్వజమెత్తారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును సాధించాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రజలను కేంద్రం ఇబ్బందులపాలు చేస్తోందన్నారు. ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఆకాష్‌ల పేరిట రాష్ట్రంలో అయోమయం సృష్టించడానికి మోదీ, షా ద్వయం కుటిల యత్నాలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వీరి ఆటలు సాగేదిలేదన్నారు. గోద్రా సంఘటనలో వందలాది మంది ముస్లిం సోదరులను అగ్నికి ఆహుతి చేసిన ఆనాటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని ధర్మానికి, చట్టానికి కట్టుబడి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకుని నేడు మోదీ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ఈనాడు ప్రధానిగా ఉండి చంద్రబాబును సాధించాలని, రాజకీయంగా చంద్రబాబు పతనాన్ని చూడాలనే కుట్రలతో, అందుకు ఎన్ని మెట్లయినా దిగజారటానికి సిద్ధపడిన మోదీ ఆటలు సాగవన్నారు. ఏమీలేని బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు ఇన్ని కోట్ల రూపాయల సంపదన ఎలా వచ్చిందో అమిత్ షా చెప్పాలన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై జీవీఎల్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.