ఆంధ్రప్రదేశ్‌

రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 9: రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణులు పోటీ చేయాలని, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అండగా ఉంటుందని రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన ప్రతినిధులు పలు అంశాలపై కీలక తీర్మానాలు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విస్తృతస్థాయి సమావేశం రాజమహేంద్రవరం కోటిలింగాలపేటలోని శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ అందరి సంక్షేమాన్ని కాంక్షించే బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రతీ ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా ఆయా పార్టీలల్లో ఎదగాలని, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసినా సమాఖ్య అండగా ఉంటుందన్నారు. 1984లో ఏర్పాటైన సమాఖ్య ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. నిధుల బకాయిలు విడుదల చేయాలని కోరారు. బ్రాహ్మణులకు తగిన సీట్లు సాధించుకోవడం, బ్రాహ్మణ కార్పొరేషన్‌కి రూ.1500 కోట్లు కేటాయించేలా చూసుకోవడం, అర్చలకు, పురోహితుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలా చూసుకోవడం వంటి అంశాలపై సమాఖ్య దృష్టి పెడుతుందన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు నాలుగు జిల్లాలకు బాధ్యత వహించేలా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నండూరి వెంకటరమణను నియమిస్తున్నట్టు సతీష్ శర్మ ప్రకటించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా తేజోమూర్తుల నర్శింహ మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు ముత్య సత్తిబాబు, రాష్ట్ర సలహా సభ్యులుగా సవితాల చక్రభాస్కరావు, నిమిషకవి వెంకటేష్‌లను ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు కలగా ప్రభాకరం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేటర్ నండూరి వెంకటరమణ, రాష్ట్ర అర్చక సమాఖ్య కార్యదర్శి కెవి ఎస్ ఆర్ ఎన్ ఆచార్యులు, గాయత్రీ పీఠం వ్యవస్థాపకులు సవితాల చక్రభాస్కరావు, నిమిషకవి వేంకటేష్, భువనగిరి వెంకట రమణ, చక్రవర్తుల సంజీవ్, భమిడిపాటి సుబ్బారావు, తేజోమూర్తుల నర్శింహమూర్తి (పండు), దీక్షితులు, సత్యనారాయణ, ముత్య సత్తిబాబు, పన్నాల సంతోషి, తోలేటి శిరీష, కళ్యాణి తదితరులు హాజరయ్యారు.