ఆంధ్రప్రదేశ్‌

పెట్రో ధరలపై నేడు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగులకు, వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం జరిగే భారత్ బంద్‌ను రాష్ట్రంలో విజయవంతం చేసేందుకు ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు వామపక్షాలు, జనసేన పార్టీ సమాయత్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 8గంటలకు విజయవాడలో ఆంధ్రరత్న భవన్ నుంచి ప్రారంభమయ్యే నిరసన ప్రదర్శనలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొననున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్నం వరకు బంద్ నిర్వహించనున్నామని రఘువీరారెడ్డి తెలిపారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు, రైతులు, యువకులు పాల్గొనాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. బంద్‌కు టీడీపీ, వైకాపా కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా పది వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సులను నడపవద్దంటూ సంస్థ ఎండీ సురేంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. బస్సు యాత్రలో ఉన్న సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు పీ మధు, కే రామకృష్ణ ఆయా ప్రాంతాల్లో బంద్‌లో పాల్గొంటారు.