ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ పాలన అవినీతిమయం: సీపీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 9: తెలుగుదేశం పార్టీ పాలన పూర్తిగా అవినీతిమయమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. సీపీఐ, సీపీఎం చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో శవానికి పోస్టుమార్టం నిర్వహించాలంటే ఐదు వేల రూపాయలు లంచం అడిగారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. వ్యక్తి మృతి చెంది కుటుంబ సభ్యులు విషాదంలో ఉంటే పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు లంచం అడగటం చూస్తే బాబు పాలన ఎంత సజావుగా సాగుతుందో అర్ధమవుతోందన్నారు. ఈ విషయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే వైద్యశాలకు వెళ్లి పోస్టుమార్టం చేయించాల్సిన దుస్థితి తెలుగుదేశం పాలనలో ప్రజలకు ఎదురవడం విచారకరమన్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధి చేయమంటే గాదె కింది పందికొక్కుల్లా మేసేస్తున్నారని ధ్వజమెత్తారు. అటెండర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడిచేస్తే అవినీతి సొమ్ము 100 కోట్లు దొరికితే, ఓ అధికారి ఇంటిపై దాడిచేస్తే 850 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము దొరికిందని, ఇలాంటప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తోంస్తుందని ఆయన నిలదీశారు. ఏసీబీ అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్లపై కూడా దాడులు చేయాలని ఆయన ఏసీబీ అధికారులకు సూచించారు. చేతులు తడపందే పనులు జరిగే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు లంచం సొమ్ము ఇవ్వలేక ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేతలు అధికార దాహంతో ఉన్నారే తప్పా ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు.