ఆంధ్రప్రదేశ్‌

మున్సిపాలిటీల పనితీరు అధ్వాన్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో అత్యంత చెత్త మున్సిపాలిటీగా సాలూరు కన్పిస్తోంది...విజయనగరం పట్టణంలో రోడ్లు బాగున్నా కాలువలు చెత్తగా ఉన్నాయి.. ఇక నుంచి ఇక్కడకు ప్రతి వారం రాష్ట్ర బృందాన్ని పంపిస్తానని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె జిల్లాలోని సాలూరు ప్రాంతంలో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఇంత ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదైన సందర్భాలు లేవన్నారు.
డెంగ్యూ, వైరల్ జ్వరాలు విజృంభించడానికి పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండటమే కారణమన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. ఎక్కడా ఎఒఎల్ (యాంటి లార్వా ఆపరేషన్) నిర్వహించిన దాఖలాలు లేవని ఆమె మండిపడ్డారు. జిల్లాలో ఫాగింగ్ ఏ మేరకు చేశారు? కాలువల్లో పూడిక ఏ మేరకు తొలగించారని ఆమె జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణను నిలదీశారు. దీనికి ఆయన సమాధానమిస్తూ జిల్లాలో పంచాయతీలకు ఎనిమిది ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయని వాటితో ఫాగింగ్ చేయిస్తున్నామని బదులిచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ జిల్లాలో 920 పంచాయతీలు ఉంటే ఎనిమిది ఎలా సరిపోతాయని నిలదీశారు. జిల్లాలో జ్వరాలపై హౌస్‌హోల్డ్ సర్వే జరిపి ఆ ఇల్లు సర్వే చేసినట్టు స్టిక్కర్లు అతికించాలని సూచించారు.
అంతేగాకుండా జిల్లాలో జ్వరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరి జవహర్‌లాల్, జెసి కెవి రమణారెడ్డి, డిఎంహెచ్‌ఒ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
పూనం మాలకొండయ్య, పక్కన కలెక్టర్ హరి జవహర్‌లాల్