ఆంధ్రప్రదేశ్‌

సోమశిల పనులు పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: సోమశిల ఉత్తర కాల్వ పొడిగింపు పనులు త్వరితగతిన పూర్తిచేసి రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో కోరారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు, లింగసముద్రం, నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలో 12,600 ఎకరాలకు సాగునీరు అందించడానికి 1959లో రాళ్లపాడు ప్రాజెక్టును 1.1 టీఎంసీల సామర్థ్యంతో మనే్నరు నదిపై నిర్మించారన్నారు. దీంతోపాటు కందుకూరు నియోజకవర్గ పరిధిలోని 133 గ్రామా ల ప్రజలకు తాగునీరు అందించడానికి మంచినీటి పథకాలు ఏర్పాటు చేశారన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణ కోసం 133 గ్రామాలకు మంచినీరు సక్రమంగా అందించడానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం సోమశిల ఉత్తర కాల్వను పొడిగించి సోమశిల నుండి రాళ్లపాడుకు 1.5 టీఎంసీల నీటిని కేటాయించి, విడుదల చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రాజెక్టు ఆయకట్టును సైతం 16వేల ఎకరాలకు పెంచిందన్నారు. 9 సంవత్సరాల కాలంగా సోమశిల ఉత్తర కాల్వ పొడిగింపు పనులు నత్తనడకన సాగవడం వల్ల రాళ్లపాడు ఆయకట్టు పరిధిలో భూములు బీళ్లుగా మారాయని, తాగునీరు కూడా లభ్యంకాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రామకృష్ణ వివరించారు.