ఆంధ్రప్రదేశ్‌

దరఖాస్తులకు ప్రత్యేక వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 9: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుండి యువనేస్తం పథకం కింద రాష్ట్రంలోని 12లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం ఇక్కడి ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద 22 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిగ్రీ, పాలిటెక్నిక్ వంటి విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భృతి కోసం నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 14న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రజాసాధికార సర్వేలో 12లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిలో అర్హులైన వారందరికీ భృతి ఇస్తామన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనివిధంగా తొలిసారిగా నవ్యాంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి అందిస్తున్నట్లు మంత్రి రవీంద్ర పేర్కొన్నారు.