ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో టెక్-2018 ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: ఈ ఏడాది నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నం నోవాటెల్ హోటల్‌లో టెక్-2018 నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ తెలిపారు. ఈ విషయమై సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఫర్ హ్యూమానిటీ (టెక్)ను యునెస్కో ఎంజీఐఈపీ (మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది. రాష్ట్రం నుంచి ఎంపికైన పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరుకానున్నారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మూడు వర్క్‌షాప్‌లు, కేటలిటిక్ సెషన్స్ నిర్వహిస్తారని ఆదిత్యనాధ్ తెలిపారు. ప్రారంభోపన్యాసం, కీలకోపన్యాసాలు చేసే అతిథులతో పాటు వీవీఐపీలకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, వసతి సదుపాయాలపై చర్చించారు.
సమావేశంలో కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ సుజాత శర్మ, ఎంజీఐఈపీ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎబల్‌కేర్, యునెస్కో అధికారి సమితా రస్తోగి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్చనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.