ఆంధ్రప్రదేశ్‌

హంతక ముఠాగా ప్రతిపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హంతకముఠాగా మారుతోందని అధికార పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం శాసనసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోలేక కడప నుంచి మనుషుల్ని తెప్పించి మిమ్మల్ని హతమారుస్తామని బాహాటంగా బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గ పరిధిలోని సరస్వతీ భూముల వ్యవహారంలో ఇంతకు ముందు భయోత్పాతం సృష్టించారని తెలిపారు. అమాయక రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని వారు ఆ భూముల్లో సాగుచేసుకుంటుంటే దళితులని కూడా చూడకుండా మారణాయుధాలు, బాంబులతో వారిని వెంటాడారని ఆవేదన వ్యక్తంచేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ప్రతిపక్షనేత జగన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వాడిన భాష అందరికీ తెలుసున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం పాదయాత్రలో అరాచకాలను సృష్టిస్తున్నారని, వీటన్నింటిపై సీబీసీఐడీచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై హోంమంత్రి చినరాజప్ప స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు తమ దృష్టికి వచ్చాయని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.