ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణుల సమస్యల పట్ల వైకాపాకు చిత్తశుద్ధి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 10: బ్రాహ్మణుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అని, అనువణువునా బ్రాహ్మణ ద్వేషం నిండిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీయేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ వేమూరి ఆనందసూర్య విమర్శించారు. విశాఖపట్నంలో వైసీపీ ఆధ్వర్యాన జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఒక ఫ్లాప్‌షో అని అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు ఆనందసూర్య, అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు కోట శంకరశర్మ, ప్రతినిధి బిఎస్ విద్యాసాగర్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ అధ్యక్షుడు వి రామకృష్ణ, ప్రతినిధి సాయినాథశర్మ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు శ్రీశర్మ, ఉపాధ్యక్షురాలు స్వరాజ్యలక్ష్మి, విశాఖపట్నం బ్రాహ్మణ నాయకుడు వసంతవాడ పురుషోత్తమరావుతో కలిసి ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహనరెడ్డి బ్రాహ్మణులను రాజమండ్రి, అనకాపల్లిలో దారుణంగా అవమానించి వారి మనోభావాలను తీవ్రస్థాయిలో దెబ్బతీశారని పేర్కొన్నారు. వాటి నష్టనివారణ కోసం తప్పనిసరై అన్యమనస్కంగానే విశాఖ సభను నిర్వహించారని తెలిపారు. వైసీపీ ఎంతోకాలంగా ఊదరకొడుతూ వచ్చిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేలనం ఒక పెద్ద ఫ్లాప్‌షోగా మిగిలిపోయిందని, స్థానికంగా ఉన్న 15 నుండి 20 సంఘాలకు చెందిన నాయకులెవ్వరూ పాల్గొనలేదని పేర్కొన్నారు. అధినేత దగ్గర తమ ప్రాబల్యాన్ని నిరూపించుకునేందుకు బ్రాహ్మణుల పేరుతో బ్రాహ్మణుల్లో ఏ మాత్రం పలుకుబడి లేని కోన రఘుపతి, మల్లాది విష్ణువంటి కొందరు తమ తాబేదారులను, ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలను పోగుచేసి మమా అనిపించారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోని బ్రాహ్మణుల వెతలను అర్థం చేసుకుని హామీ ఇచ్చిన మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ నెలకొల్పి క్రమం తప్పకుండా బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఆ మేరకు పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుల మనస్సును గెలిచారని అన్నారు. ప్రస్తుతం విశాఖ సభలో ప్రస్తావించిన అంశాలన్నీ ఇప్పటికే అమలు జరుగుతున్న విషయం లబ్ధిపొందుతున్న బ్రాహ్మణులందరికీ తెలుసని పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఎంతో నమ్మకంతో ఐవైఆర్ కృష్ణారావుకు బాధ్యతలు అప్పగిస్తే వాటిని విస్మరించి కార్యకలాపాలను ముందుకు తీసుకుపోకుండా ప్రభుత్వం చేత తొలగించబడ్డారని, అటువంటి వారు కూడా ఈరోజు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చిత్తశుద్ధి లేని వైసీపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో రాష్ట్రంలో చైతన్యవంతులైన బ్రాహ్మణులు లేరన్న వాస్తవాన్ని గుర్తెరగాలని హితవు పలికారు.
బ్రాహ్మణేతరులతో
ఆత్మీయ సమ్మేళనం : సిరిపురపు
విశాఖలో వైఎస్ జగన్ బ్రాహ్మణేతరులతో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి తుస్సుమనిపించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ శర్మ పేర్కొన్నారు. 13 జిల్లాల నుండి 500 మంది బ్రాహ్మణులు కూడా హాజరుకాలేని దుస్థితి వైసీపీకి దాపురించిందని ఎద్దేవాచేశారు. బ్రాహ్మణ సమాజానికి తమ పార్టీ తరపున ఏమి చేస్తారో చెప్పలేకపోయారని, తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోను మినహాయించి ఆయన ఇచ్చిన హామీలేవి లేవని విమర్శించారు. కోన రఘుపతి, మల్లాది విష్ణు కలిసి 13 జిల్లాలు తిరిగి వేలాది మందితో ఈ సమావేశం నిర్వహించాలని ప్రయత్నాలు చేసి అభాసుపాలయ్యారన్నారు. వారి వారి నియోజకవర్గాల్లో ఏనాడూ ఏ బ్రాహ్మణునికి సహాయ సహకారాలు అందించిన పాపాన పోలేదని విమర్శించారు. వీరందరినీ నమ్మి జగన్ బ్రాహ్మణకులంలో చిచ్చుపెట్టేందుకు ఈ సమావేశం ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారని భవిష్యత్తులో బ్రాహ్మణులంతా తగురీతిలో బుద్ధిచెప్పనున్నారని హెచ్చరించారు.