ఆంధ్రప్రదేశ్‌

సీమకు సాగునీరు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: రాయలసీమలో ప్రజలకు మంచినీటితోపాటు సాగునీరు కూడా అందించాలని ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వై కేశవరావు, ప్రధాన కార్యదర్శి పీ పెద్దిరెడ్డి, ఉపాధ్యక్షులు పీ నరసింహారావు సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెలలో ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయన్నారు. గత ఏడాది కన్నా 190 టీఎంసీల నీరు అదనంగా ఉన్నదన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నీరు విడుదలకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవకాశమున్న చెరువులు, రిజర్వాయర్లను నింపాలని వారు కోరారు.