ఆంధ్రప్రదేశ్‌

మల్లీప్లెక్స్‌ల్లో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: మల్టీప్లెక్స్‌లో కన్నా విమానాశ్రయంలోకి వెళ్లడం సులువు అని, మల్లీప్లెక్స్‌ల్లో దోపిడీ ఎక్కువగా ఉందని పలువులు ఎమ్మెల్సీలు ఆరోపించారు. రాష్ట్ర శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మల్టీపెక్స్‌ల్లో ఎమ్పార్పీ ధరలు అమలుపై ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, వివివి చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇచ్చారు. అనేక తనిఖీలు నిర్వహిస్తూ, ఎమ్మార్పీకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ మూర్తి స్పందిస్తూ అన్ని రకాలు అమ్మేలా చూడాలన్నారు. ఎమ్మెల్సీ చౌదరి మాట్లాడుతూ వినోదం కోసం సినిమాకు వెళ్లే మధ్యతరగతి కుటుంబాల జేబులు ఖాళీ అవుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సిండికేట్‌గా మారి పెంచి అమ్ముతున్నారన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సినిమా హాళ్లలో పార్కింగ్ రుసుం ఎక్కువగా వసూలు చేస్తున్నారన్నారు. పప్పల చలపతిరావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఆదినారాయణ రెడ్డి బదులిస్తూ, మత్స్యకారులకు డీజల్‌పై రాయితీని 12.50 రూపాయలకు పెంచాలని కోరుతూ ఫైల్‌ను సీఎంకు పంపామన్నారు.