ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడి నిధి, పసుపు, కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ. 8,600 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: పెట్టుబడి నిధి, పసుపుకుంకుమ కింద రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు రూ.8,604.20 కోట్ల నిధులను మంజూరు చేశామని, తొలి మూడు విడతల్లో రూ.6,883.44 కోట్లు నిధులు వారి ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సెర్ప్ శాఖామంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. విజయవాడలోని ఆర్టీసీ పరిపాలనా భవనంలోని సెర్ప్ కార్యాలయంలో 13 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో, మండల అధ్యక్షరాళ్లతో క్షేత్రస్థాయి సిబ్బందితో సెర్ప్ సీఇఓ పి కృష్ణమోహన్‌తో కల్సి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ పెట్టుబడి నిధి, పసుపుకుంకుమ కింద ప్రతీ సభ్యురాలికి ప్రభుత్వం అందించిన నిధుల వివరాలపై అవగాహన కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలతో నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలతో నిర్ధారణ చేసుకునే ప్రక్రియను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతీ సభ్యురాలికీ ఆమె పేరుతో ఎంతమేర పసుపుకుంకుమ, పెట్టుబడి నిధి, వడ్డీరాయితీ పొందిందో ధ్రువీకరణ పత్రం తీసుకుంటూనే అదే సమయంలో అందకపోతే వాటి వివరాలు కూడా నిర్ధారించుకుని తగినవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మొత్తం ప్రక్రియను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలనే సంకల్పంతో మహిళల ప్రక్షాన ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 8 లక్షల 54 వేల సంఘాల్లోని 86,04,304 మంది డ్వాక్రా మహిళలకు ప్రయోజనం కల్పించామన్నారు.
నిపుణుల సూచనలు మేరకు రుణామాఫీకి దీటుగా ప్రత్యామ్నాయంగా పసుపుకుంకుమ, పెట్టుబడి నిధిగా 8,604.30 కోట్లు నిధులు మంజూరు చేసి తొలి మూడు విడతల్లో రూ.6,883.44 కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు. త్వరలో మరో 1720.86 కోట్ల రూపాయలు విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రతీ మహిళకూ 10,000 రూపాయలు చొప్పున పసుపుకుంకుమ, పెట్టుబడి నిధిగా మంజూరు చేయడం జరిగిందని, దీని ద్వారా రుణాలు తీసుకున్నవారికి, తిరిగి చెల్లించినవారికి, కట్టాల్సిన వారికి, అసలు రుణాలు తీసుకోని వారికి సమానంగా ప్రోత్సాహం ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమన్నారు. వడ్డీరాయితీ కింద డ్వాక్రా మహిళా తాము అందించిన సాయం రూ.13,393.35 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఎంతో నిబద్ధతతో వారు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే శాతం 98-99 శాతం మధ్యలో ఉండడం గర్వకారణమన్నారు. వీరు తీసుకునే రుణాలు ప్రతీ ఏడాది 12వేల నుండి 13వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ, ఇతర సామాజిక కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళలు చక్కని పనితీరు చూపుతున్నారని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయని, మన ప్రాజెక్టు సిబ్బంది గ్రామ, మండల స్థాయి సభ్యులతో సమావేశమై సమాజంలో తమవంతు పాత్ర సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో చర్చించాలన్నారు. వైద్యశాఖాధికారులు, ఇతర అధికారులు సూచనలు మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా స్పందించేలాగా చర్యలు చేపట్టాలన్నారు.