ఆంధ్రప్రదేశ్‌

కోటి టన్నుల అక్రమ మైనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట: గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, దాచేపల్లి ప్రాంతాల్లో 600 కోట్ల రూపాయల విలువైన కోటి టన్నుల అక్రమ మైనింగ్ జరిగిందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నర్సరావుపేటలోని వైకాపా నేత కాసు మహేష్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, సేల్స్ టాక్స్, రాయల్టీ తదితరవాటిని కలుపుకుంటే సుమారు 12వందల కోట్ల రూపాయల అక్రమార్కులు దోచుకున్నారన్నారు. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబుకు కూడా తెలుసని అన్నారు. దీనిపై కాగ్, సీబీఐ, కేంద్ర అధికారులకు వినతిపత్రాలను అందజేస్తామన్నారు. దీనిని వైసీపీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. నాలుగు సంవత్సరాలుగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ చేస్తున్నారని, దానిపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ వేశారని, దీనికి స్పందించిన కోర్టు 13 శాఖల అధికారులకు నోటీసులు పంపిస్తే ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు. అక్రమ మైనింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడైన యరపతినేని శ్రీనివాసరావును రక్షించడం కోసం ప్రభుత్వం రకరకాలుగా మలుపులు తిప్పుతుందన్నారు. ఖనిజ సంపద జాతీయ సంపదని, దీనిపై కలెక్టర్ విచారణ చేసి, దోషులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లోకాయుక్తకు కూడా స్థానికులు కంప్లైంట్ చేశారని అన్నారు. వైసీపీ నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి అంబటి రాంబాబు మాట్లాడుతూ తాము అక్రమ మైనింగ్ చేసిన ప్రాంతానికి వెళ్దామనుకుంటే పోలీసులు గృహ నిర్బంధం చేశారని, దీనిపై తమ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిజనిర్ధారణ కమిటీని వేశారని అన్నారు. శాసనమండలి చైర్మన్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజేంద్రనాథ్ రెడ్డి, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ తదితరులు ఈ కమిటీలో ఉన్నారని స్పష్టం చేశారు. కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల నుండి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల అండదండలతో స్థానిక ఎమ్మెల్యే యరపతినేని అక్రమమైనింగ్ చేస్తున్నారన్నారు.