ఆంధ్రప్రదేశ్‌

సీఎంకు లారీ యజమానుల సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ రెండు రూపాయలకు తగ్గించటం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఘనంగా సత్కరించారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి గోపాలనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని రాష్ట్ర కార్యవర్గసభ్యులు కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. లారీ ఫీల్డ్‌పై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కార్మికుల సంక్షేమానికి ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనకరం కాగలదనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీఎంను గజమాల, దుశ్శాలువతో సత్కరించారు. సంఘం ప్రధానకార్యదర్శి వైవీ ఈశ్వరరావు, కోశాధికారి ఎన్ కృష్ణలతో పాటు పెద్దఎత్తున కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.