ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 12: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి బీ రామాంజనేయులు ఆకాంక్షించారు. బుధవారం సచివాలయం ఒకటో బ్లాక్‌లో సమాచార శాఖ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అవి హక్కుపరంగా ప్రజలకు అందించాల్సి ఉందన్నారు. ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారథిగా సమాచార, పౌర సంబంధాల శాఖ వ్యవహరిస్తోందని చెప్పారు.
ప్రభుత్వ పథకాల అమలులో అన్ని శాఖలు, మీడియాతో సమన్వయం చేసుకుంటూ ప్రజలందరికీ వాటి ఫలాలు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం, ప్రజలు వేరుకాదన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. సమాజంలో కీలక భూమిక పోషిస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు సమన్వయంతో కుటుంబంలా కలసి పనిచేయాలని కోరారు. రానున్న ఆరు నెలలు కీలకమన్నారు. సమాచార సేకరణలో అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఉద్యోగులకు నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. పౌర సంబంధాల శాఖపై సీఎం నమ్మకాన్ని వాస్తవ రూపంలో చూపుతామన్నారు.
క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర సమాచార శాఖలో వివిధ విభాగాల పనితీరును రామాంజనేయులుకు జాయింట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ వీ సూర్యనారాయణమూర్తి, సీఈఓ మధుసూదన్, డీడీ కస్తూరిబాయి, పలువురు ఏడీలు, పీఆర్వోలు పాల్గొన్నారు.