ఆంధ్రప్రదేశ్‌

మీకుగల్లీలో తిరిగే ధైర్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న గల్లీలో కూడా తిరిగే ధైర్యం లేని రాష్ట్ర బీజేపీ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు విమర్శించారు. లేఖలు రాస్తూ, ప్రెస్‌మీట్‌లు పెడుతూ ప్రభుత్వంపై అసత్యారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పిల్లుల్లా, ఢిల్లీల్లో పేపర్ టైగర్‌లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడ రాష్ట్ర టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలు నెరవేర్చాలని ఒత్తిడి తెచ్చే దమ్ము కన్నా లక్ష్మీనారాయణకు ఉందా అంటూ నిలదీశారు. మోదీ మెప్పు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించడం తప్ప 5కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలు బీజేపీ నేతలకు పట్టడం లేదన్నారు.