ఆంధ్రప్రదేశ్‌

గోరంట్లలో రూ. 65 కోట్లతో నిషా డిజైన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో రెండో పరిశ్రమ ఏర్పాటుకు నిషా డిజైన్స్ సంస్థ ముందుకొచ్చింది. అనంతపురం జిల్లా గోరంట్లలో రూ. 65 కోట్లతో ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రభుత్వం తరపున ఈడీబీ సీఈఓ కృష్ణకిషోర్, నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ గోయంకా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రతి పరిశ్రమలో 80శాతం మహిళలకు ఉపాధి కల్పిస్తున్న నిషా డిజైన్స్ రెండో యూనిట్ ద్వారా 15వందల మందికి ఉపాధి కల్పించనున్నారు.
అనంతపురం జిల్లా హిందూపూర్‌లో ఇప్పటికే మొదటి పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేస్తున్న నిషా డిజైన్స్ దేశంలో రూ. 700 కోట్ల టర్నోవర్‌తో పరిశ్రమలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మూడు పరిశ్రమలను నెలకొల్పి 10వేల మందికి ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ గోయంకా వెల్లడించారు. గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉన్నాయని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు జరిపిన పరిశీలనలో ఏపీ తమను ఆకట్టుకుందని తెలిపారు. జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు గార్మెంట్స్ పరిశ్రమలు నెలకొల్పాలని ఒత్తిడి తెస్తున్నా కాదని ఏపీని ఎంపిక చేసుకున్నట్లు వివరించారు. పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ అత్యంత అనుకూలమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో హార్డ్‌వేర్ పరిశ్రమ విస్తరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మొబైల్ పరిశ్రమ దూసుకెళుతోందని, మహిళలకు ఉపాధి కల్పనలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. దేశంలోని ఎనిమిది పరిశ్రమల్లో విదేశీ అవసరాలకు తగ్గట్టుగా నిషా డిజైన్స్ అత్యుత్తమ నాణ్యతతో విలువైన దుస్తులను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులతో మార్కెట్ గిరాకీ సాధించింది.

చిత్రం..నిషా డిజైన్స్ సంస్థతో సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ప్రతినిధులు