ఆంధ్రప్రదేశ్‌

తిరస్కరించిన డిజైన్లకు రూ.1.15 కోట్లు చెల్లింపులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 15: రాజధాని నిర్మాణ వ్యయంపై ఆడిట్ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. అమరావతి బాండ్ల జారీలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు సవాల్ చేశారని, అవినీతి జరిగిందని తాను ఏనాడూ చెప్పలేదని, అధిక వడ్డీకి ఎందుకు తీసుకున్నారో చెప్పాలని అడిగానని ఉండవలి అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. ఆడిట్ శాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై తాను వేసే ప్రశ్నలకు సమాధానం చెబితే సరిపోతుందన్నారు. తీసుకునే రుణానికి వడ్డీ 8 శాతం మించకూడదని ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం 10.36 శాతం వడ్డీకి ఎందుకు తీసుకుందో చెప్పాలని తాను ప్రశ్నిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి 9 శాతం వడ్డీ ఇస్తామంటే ప్రజలే ప్రభుత్వానికి అప్పుగా ఇస్తారన్నారు. పోలవరం, పట్టిసీమ, పేదల అపార్టుమెంట్లు, రాజధాని నిర్మాణం ఇలా దేనికి సంబంధించి సమాచారం కావాల్సినా కార్యాలయానికి వస్తే ఇస్తామని కుటుంబరావు చెప్పడం సంతోషమన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం కావాలని, అందుకోసం ఎపుడు రమ్మన్నా వస్తానన్నారు. హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి డిజైన్లను 95.2 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు మాకీ అసోసియేట్స్ తయారు చేసి అవి చండీఘర్ అసెంబ్లీ భవనంలా, థర్మల్ పవర్ ప్లాంట్ పూల్ టవర్స్‌లా ఉన్నాయని ప్రజల నుంచి అభిప్రాయం వచ్చినట్టు చెప్పి తిరస్కరించారని, అయితే వారికి మాత్రం ఖర్చులుగా రూ.1.15 కోట్లు ఇచ్చారన్నారు. వారు చేసిన పని నచ్చనపుడు అంత డబ్బు ఎందుకు చెల్లించారని ఉండవల్లి ప్రశ్నించారు. వీరికి డబ్బులిచ్చి మరీ తిట్టించుకున్నట్టయిందన్నారు. అరిహంత్ ఇండో ఆఫ్రికన్ ఇన్‌ఫ్రా బిల్డర్స్ అండ్ డవలపర్స్ సంస్థతోపాటు మరో సంస్థకు రూ.13 కోట్లు అదనంగా చెల్లించారని ఆడిట్ అభ్యంతరం వచ్చిందన్నారు. సింగపూర్ కన్సల్టేరియంకు 1699 ఎకరాలకు సంబంధించిన కాగితాలను అడిగినా ఇవ్వలేదని స్పష్టంగా నిలదీశారన్నారు. రాజధానిలో భవనాల నిర్మాణానికి రూ.53.74 కోట్ల అంచనా వ్యయంతో టెండుర్లు పిలిస్తే ఎల్ అండ్ టి కంపెనీ, పల్లోజీ కంపెనీలు రెండే వేశాయని, వీరిలో ఒకరు రూ.103 కోట్లకు చేస్తామని చెప్పారన్నారు. అంచనా వ్యయం కంటే 5 శాతం అధికమైనా టెండర్లు రద్దు చేసి మళ్లీ పిలవాలనేది నిబంధన అన్నారు.
సంప్రదింపుల పేరిట 25 శాతానికి రెండు పనులు, 26 శాతం తగ్గించి ఒక పనిని మూడు ప్యాకేజీలుగా ఇచ్చామన్నారని తెలిపారు. ఆ తర్వాత ఫైల్ ఫౌండేషన్ పేరుతో చేశారంటూ తగ్గించిన 25 శాతం కూడా ఇచ్చేసి వారికి సర్ధుబాటు చేశారన్నారు. ఇది ఏ ప్రకారం చేశారని ఆడిట్ శాఖ ప్రశ్నించిందన్నారు. 10 శాతం సెక్యురిటీగా ఉంచుకుంటారని, భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత వర్షం కురిస్తే లీకేజీలు వచ్చినట్టు వార్తలు వచ్చాయని, అటువంటి సందర్భాల్లో ఈ సెక్యురిటీ డిపాజిట్‌ను ఉపయోగిస్తారన్నారు. కానీ సెక్యురిటీ డిపాజిట్ సొమ్మును కూడా వారికి ఇచ్చేశారని ఉండవల్లి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2015 మార్చి 31వ తేదీన రూ.500 కోట్లు ఇస్తే దానిని 2016 మార్చి 19 వరకు ఖర్చు పెట్టలేదన్నారు. డబ్బు ఉండి కూడా అప్పుల కోసం ఎందుకు పరుగులు పెట్టారో అర్ధం కాలేదన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.350 కోట్లు కేంద్రం ఇస్తే దానిని రైతు సాధికారత కోసం మళ్ళించి వినియోగపు ధ్రువీకరణ పత్రాలను పంపలేదన్నారు. యూసీలు రాలేదని కేంద్రం చెబుతున్నదీ బహుశా ఇదేనేమోనన్నారు. 2017 ఆగస్టు 16వ తేదీన ఆడిట్ శాఖ నివేదికలోని అభ్యంతరాలపై తాను ఈ ప్రశ్నలు వేస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పనులు చేయకుండా బిల్లుల చెల్లింపు జరగదని కుటుంబరావు అన్నారని, కానీ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ వారు పోలవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు రాసిన లేఖలో మాత్రం రూ.101 కోట్ల చెల్లింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారని ఉండవల్లి పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూలీలకు నెలకు రూ.2500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు చెల్లించాలని, ఇందులో కూడా మోళీ జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శే్వతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తుంటే దానిపై కూడా మాట్లాడరన్నారు. తాను వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్తానంటే చెరుకూరి కుటుంబరావు కార్యాలయానికి వెళ్లేందుకు తనకకు ఎటువంటి అభ్యంతరం లేదని, తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఉండవల్లి కోరారు. విలేకరుల సమావేశంలో నాయకులు చెరుకూరి రామారావు, అల్లు బాబి, అచ్యుత్ దేశాయ్, పసుపులేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.