ఆంధ్రప్రదేశ్‌

రాఫెల్ కొనుగోళ్లు అతి పెద్ద కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 15: రాఫెల్ జెట్ విమానాల కొనుగోళ్లు అతిపెద్ద కుంభకోణమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. జెట్ విమానాల కొనుకోళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, సంక్షేమాన్ని విస్మరించడం క్షమించరాని నేరమని అన్నారు. రాష్టప్రతి రామ్‌నాథ్ వింద్‌కు పంపించాలని కోరుతూ శనివారం కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రాన్ని రఘువీరా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచదేశాల్లో రక్షణశాఖకు సంబంధించి ఎక్కడా జరగని అతి పెద్ద కుంభకోణం మన దేశంలో జరిగిందన్నారు. 2012 డిసెంబర్ నెలలో యూపీఏ ప్రభుత్వం హయాంలో నిర్దేశించిన టెండర్ ప్రకారం ఒక్కొక్క రాఫెల్ యుద్ధ వివిమానం ధర రూ. 526.10 కోట్లని ఈ ప్రకారం మొత్తం 36 యుద్ధ విమానాల విలువ రూ.19,940 కోట్లని ప్రకటించారన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసి ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.1670.70 కోట్ల ప్రకారం 36 యుద్ధ విమానాలకు రూ. 60,145 కోట్లు అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు చెల్లించిందన్నారు. బీజేపి ప్రభుత్వం 36 యుద్ధ విమానాల కోనుగోలుకు రూ.41,205 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయటమే కాకుండా దేశభద్రతకు రక్షణ లేని చర్యలు చేపట్టిందన్నారు. యుద్ధ విమానాల తయారీలో అపార అనుభవం ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని పక్కనపెట్టి ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ సంస్థతో ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకోవడం ద్వారా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు.