ఆంధ్రప్రదేశ్‌

దశాబ్దాల కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 15: కొండవీటి వాగు. ఈ పేరు చెబితేనే గుంటూరు జిల్లాలోని నాలుగు మండలాల రైతాంగం గుండెల్లో ఆందోళన పెల్లుబుకుతుంది. ఒకటి కాదు..రెండు కాదు నాలుగు దశాబ్దాలుగా వాగు వరదనీటి కారణంగా ఏటా వేల ఎకరాల పంటలు నీట మునగటంతో పాటు ఊళ్లు సెలయేళ్లులా మారే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాలు మారినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద కొండవీడు కొండల్లో పుట్టిన ఈ వాగు లాం సమీపం నుంచి తాడికొండ, తుళ్లూరులోని కొన్ని గ్రామాల మీదుగా రాజధాని అమరావతి వరకు ప్రవహిస్తుంటుంది. మొత్తం 29.5 కిలోమీటర్ల పరిధిలో ప్రవహించే ఈ వాగుకు మార్గం మధ్యలో ఐయ్యన్నవాగు, పొట్టేళ్ల వాగు, పాలవాగులు కలుస్తాయి. భారీ వర్షాలు, తుపాన్ల వల్ల వాగులు పొంగి ప్రవహించి ఊళ్లను ముంచెత్తుతుంటాయి. సుమారు 15వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తుంటుంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించకపోవటంతో ఏటా ఉగ్రరూపం దాల్చుతోంది. గుంటూరు, తాడికొండ, తుళ్లూరు, అమరావతి మండల గ్రామాల్లో సుమారు 15వేల ఎకరాలకు పైగా పంటలు నీట మునిగి రైతాంగం నష్టపోయే దయనీయ పరిస్థితులు ఉండేవి. ఇందులో 10వేల ఎకరాలు రాజధాని ప్రాంతంలోనే ఉన్నాయి. వాగు ముంపు సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు కూడా వేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదికి ఎగువన కొండవీటి వాగు కలుస్తుంది. బ్యారేజీ వద్ద కృష్ణానది కంటె వాగు నీటిమట్టం దిగువన ఉండటంతో వరద సమయాల్లో నీరు వెనక్కు ప్రవహించి ఊళ్లను ముంచెత్తేది. 1981లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కొండలను తొలచి సొరంగ మార్గంలో కృష్ణానదికి కొండవీటి వాగును తరలించేందుకు రూ 150 కోట్ల అంచనాతో డిజైన్లు రూపొందించినా అవి కార్యరూపం దాల్చలేదు. అనంతరం జలయజ్ఞంలో భాగంగా కృష్ణాడెల్టా ఆధునీకరణ పనుల జాబితాలో దీన్ని చేర్చారు. దానికీ మోక్షం లభించలేదు. ఈ పరిస్థితుల్లో కొండవీటి వాగులో కలిసే మరికొన్ని వాగుల క్యాచ్‌మెంట్ ఏరియాను తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించింది. సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన అంశాలు, నిపుణుల సలహాలను క్రోడీకరించి నూరేళ్ల నీటి ప్రవాహాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రకాశం బ్యారేజీ ఎగువన సీతానగరం వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉదయం 10 గంటలకు సీతానగరం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పథకాన్ని ప్రారంభించనున్నారు.