ఆంధ్రప్రదేశ్‌

అక్రమకేసులు.. తప్పుడు సర్వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 15: ప్రజల్లో విశ్వసనీయత ఉన్న నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ.. తప్పుడు సర్వేలతో మభ్యపెడుతున్నారని కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బాబ్లీ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయటం వెనుక బీజేపీ, వైసీపీల కుట్ర దాగి ఉందని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇస్తూ దొంగల్ని మాత్రం దేశ సరిహద్దులు దాటిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ నేత జగన్ లాంటి అవినీతిపరులతో బీజేపీ అంటకాగుతోందని మండిపడ్డారు. బీజేపీ పెడధోరణులు దేశానికే ముప్పుగా పరిణమించాయని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల వ్యూహాలు ఒక్కటొక్కటిగా వికటిస్తున్నాయని విమర్శించారు. విజయ్ మాల్యా, నీరబ్ మోదీ, మెహుల్ చోక్సీ పరారీ వెనుక ఉన్న గుట్టురట్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పరారు కావటం వెనుక సూత్రదారులు, పాత్రదారులెవరో తేల్చాలన్నారు. ఎనినిదేళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడితే ఇప్పుడు వారెంట్లు జారీ చేయటమేంటని ప్రశ్నించారు. బాబ్లీపై పోరాటంలో 74 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం లాఠీదెబ్బలు తిన్నదెవరి కోసమో తెలుగు ప్రజలకు తెలుసన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలనేదే టీడీపీ ధ్యేయమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని దెబ్బతీయాలనేదే నరేంద్రమోదీ వ్యూహమన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో మోదీ వ్యతిరేకశక్తులన్నీ ఏకం కావటంతో బీజేపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలహీన పరిచేందుకు మోదీ మహా కుట్ర పన్నారని ఆరోపించారు. వారెంట్లు ఇందులో భాగమే అన్నారు. తమ చెప్పుచేతల్లోని సర్వే సంస్థలతో వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో ఇవే సంస్థలు చేసిన సర్వేలు అవాస్తవమని ప్రజా తీర్పు నిరూపించిందన్నారు. సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటం అసాధ్యమన్నారు. వేధింపులకు దిగితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న టీడీపీని దూరం చేయటం ఎవరితరం కాదన్నారు.