ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు బాగుండాలంటే నరేంద్ర మోదీని గద్దె దించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: ప్రజా సంక్షేమం దృష్ట్యా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలతో కొత్త రికార్డులు సృష్టిస్తున్న మోదీకి అభినందనలు తెలిపాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వివిధ కారణాల వల్ల మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటయ్యే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆమెతో మీట్ ది ప్రెస్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెట్రో ధరలు పెంచడం ద్వారా అన్ని వర్గాల ప్రజరపై భారం మోపి, ఇబ్బందుల పాలు చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్న మోదీని అభినందించాలని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలకు సంబంధం లేకుండా పెట్రోల్ ధరలు పెంచుతున్నారన్నారు. ఇతర దేశాల్లో పెట్రోలు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని గుర్తు చేశారు. 2004 నుంచి 2018 వరకూ చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ద్వారా 1.78 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం కేంద్రానికి వచ్చిందన్నారు. మధ్యతరగతి, ఫిక్స్‌డ్ ఆదాయ వర్గాలపై జీఎస్టీ ద్వారా కేంద్రం కోలుకోని దెబ్బ తీసిందన్నారు. నోట్ల రద్దు వల్ల అసంఘటిత రంగంలో దాదాపు 20లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. పెట్రో ధరల నియంత్రణ, ఉపాధి కల్పన, రైతులకు భరోసా, తదితరం రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇచ్చిన అన్ని హామీల్లో విఫలమయ్యారని, ప్రజల క్షేమం దృష్ట్యా మోదీ ప్రభుత్వాన్ని తొలగించాలని ధ్వజమెత్తారు. ఆరెస్సెస్ అడుగుజాడల్లో నడిచే బీజేపీ ప్రభుత్వం సనాతన హిందూ సంస్థలు, గో రక్షక కమిటీలు.. దళితులపై చేసే దాడులను పట్టించుకోదని, ఇవి ఆ పార్టీ దృష్టిలో మంచి ఉగ్రవాదమని ఎద్దేవా చేశారు. ప్రజాసామ్యం కోసం, ప్రజల కోసం చేసే ఆందోళనల వంటివి చెడ్డ ఉగ్రవాదంగా బీజేపీ భావిస్తుందని విమర్శించారు. కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తుంటారన్నారు. టీడీపీ, వైకాపా కూడా బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలనే అనుసరిస్తున్నాయని ఆరోపించారు. అందుకే తాము జనసేన వంటి పార్టీలతో కలిసి పని చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహాలపై అక్టోబర్‌లో జరిగే కేంద్ర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మతాన్ని ఎన్నికల్లో వాడుకుంటూ దానిని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు, రాజ్యాంగం, కనీస ప్రజాసామ్య విలువలపై బీజేపీకి గౌరవం లేదని విమర్శించారు. వివిధ పార్టీలకు వచ్చే విరాళాలను గోప్యంగా ఉంచేలా చట్టానికి మార్పులు తీసుకువచ్చారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థూల జాతీయోత్పత్తి 1.5 శాతం మేర పడిపోయిందని ఆరోపించారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో ఉండి, నోటీసులు రాకుండా చేసుకోకుండా చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేయడంలో అర్థం లేదన్నారు. ఎన్నికల సంస్కరణలు అవసరమని, ఓట్ల దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలన్నారు. ప్రజాఉద్యమాల్లో ముందు ఉంటున్నప్పటికీ, దానిని ఓట్లుగా మార్చుకోవడం కష్టంగా మారిందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జాతీయ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం లేదని, రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి వల్ల ఇది సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.