ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ సిబ్బంది చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: ఆర్టీసీ సిబ్బంది చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సంస్థ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్ సురేంద్రబాబు హితవు పలికారు. చెడు అలవాట్ల కారణంగా వ్యక్తిగత ఆరోగ్యం పాడవడం, కుటుంబ ప్రగతి కుంటుపడడం వంటి నష్టాలు కలుగుతాయన్నారు. సిబ్బంది ఆర్టీసీ సంస్థ ప్రతిష్ట ఇనుమడించేలా బాధ్యతగా నడుచుకోవాలన్నారు. స్థానిక విద్యాధరపురంలోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో శనివారం జరిగిన కౌన్సిలింగ్‌లో ఆయన ప్రసంగించారు. సిబ్బంది చెడు అలవాట్లకు గురైతే వారు ఆర్థికంగా పతనం కావడం, పేరు ప్రతిష్టలు కోల్పోవడంతోపాటు, అలాంటి వారి కారణంగా సంస్థ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగి సంస్థ విశ్వసనీయత కోల్పోయే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. మద్యం, పాన్ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు, అలాగే మత్తు పదార్థాల వల్ల కలిగే అనారోగ్యాల గురించి సంస్థ సీనియర్ మెడికల్ అఫీసర్ డాక్టర్ అప్పారావు, డాక్టర్ సింధూర డ్రైవర్లకు తెలిపారు.