ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక వికేంద్రీకరణ దిశగా నవ్యాంధ్ర పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పారిశ్రామికీకరణ ఒకేచోట కేంద్రీకరణ జరిగితే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెంది మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కావాలి. అంటే వికేంద్రీకరణ జరగాలి. ముందస్తు ఆలోచనలతో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పరిశ్రమలను వికేంద్రీకరణ చేసే దిశగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అన్ని జిల్లాలు, పట్టణాల్లో ఏదో ఒక సంస్థను ఏర్పాటుచేయడం ద్వారా ఆ ప్రాంతానికి తగిన గుర్తింపు తీసుకువస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెంది, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. అలాంటి పరిస్థితి తిరిగి నవ్యాంధ్రకు రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రధాన నగరాలకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం, కడప, చిత్తూరు, విశాఖపట్నం ఇలా చాలా ప్రదేశాల్లో పరిశ్రమలు, జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేసింది. విశాఖలో ఐఐఎం, తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, కర్నూలో ఐఐఐటీ, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ, గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీ వంటి సంస్థలు ఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు అనేక ఉత్పాదక సంస్థలు, ఆటోమెబైల్ కంపెనీలు, ఐటీ సంస్థలు విశాఖ, విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో పెద్దఎత్తున ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే ఏర్పాటైన చిత్తూరు శ్రీసిటీ వంటి ప్రత్యేక ఆర్థిక మండళ్లలో చాలా ఎలక్ట్రానిక్ కంపెనీలు స్థాపితమయ్యాయి. ఓడరేవుల ద్వారా విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికను ప్రభుత్వం అమలుచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక విధానం, పలు విధానపరమైన నిర్ణయాలతో నవ్యాంధ్రకు పెద్ద, చిన్న కంపెనీలు క్యూ కడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న దౌత్యపరమైన చొరవ కారణంగా విదేశీ సంస్థలు రూ 100 కోట్ల నుంచి వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి కారణంగా పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. అన్నింటికీ మించి సులభతర వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవటంతో భారీ పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో భారీ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. కరవుసీమ అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత దశ, దిశ మారిపోయింది. అదే స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందనే నమ్మకాన్ని ప్రభుత్వం కలిగించటంతో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు రాయితీలు, వౌలిక వసతులు కల్పించటంతో ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. అన్నింటికీ మించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ ర్యాంక్ సాధించటంతో పరిశ్రమల ఏర్పాటుకు భారీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ 98.42 శాతం స్కోర్ సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, తెలంగాణ 98.33 శాతం స్కోర్ సాధించి రెండో స్థానంలో నిలిచింది.
పెట్టుబడుల ఒప్పందాలు
పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు 2730 ప్రాజెక్టులు కాగా, వీటిపై పెట్టే పెట్టుబడులు రూ 16,04,746 కోట్లు అయితే తద్వారా లభించే ఉపాధి అవకాశాలు 34,03,548 గా ప్రభుత్వం భావిస్తోంది. కాగా వీటిలో ఇప్పటి వరకు 721 ప్రాజెక్టులు పూర్తయి పెట్టుబడులు రూ 1,48,462 కోట్లుపెట్టారు. పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 2,26,305 మందికి ఉపాధి లభించింది. ఇదిలా ఉంటే చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా రూ 4,31,253 కోట్లతో చేపట్టే మరో 808 ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల 7,04,580 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న అన్ని ప్రాజెక్టులు పూర్తయితే తద్వారా 34 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తొమ్మిది విధానపరమైన నిర్ణయాల వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. సింగిల్ డెస్క్ విధానం 2015, 2015-20 పారిశ్రామికా భివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యవస్థాపనల విధానం, ఆహారశుద్ధి విధానం, ఆటోమొబైళ్లు, ఆటో విడిభాగాల తయారీ విధానం, జీవ సాంకేతిక విధానం, చిల్లర వ్యాపార విధానం అమలుచేస్తూ ముందు చూపుతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. 2020 నాటికి 30.76 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. ఇప్పటికే ఇసుజు, ఫాక్స్‌కాన్, బెర్జర్ పెయింట్స్, గయేసా, డిక్సన్, సెల్‌కాన్, మాండలెజ్ సంస్థలు స్థాపించబడ్డాయి. కాగా కియా మోటార్స్, అపోలో టైర్స్, గ్రీన్ ప్లై, జైన్‌ఫుడ్ పార్క్, హీరో మోటార్స్, ఆసియన్ పెయింట్స్ పతంజలి సంస్థలు అమల్లో ఉన్నాయి. 2014 నుంచి 2018 వరకు ఏపీ ప్రభుత్వం తయారీ రంగంలో 512 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. వీటిలో రూ 44,299 కోట్ల పెట్టుబడులు, 95,369 ఉద్యోగాలు కల్పించబడి 171 ప్రాజెక్టులు అమలయ్యాయి. అధునాతన 175 ఎంఎస్‌ఎంఈ పార్కుల స్థాపనకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యంతో ప్రభుత్వం ఎం-పార్క్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానపరమైన నిర్ణయం మేరకు ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 2023 నాటికి 200 ఎం- పార్క్‌లలో 3 లక్షల ఉద్యోగాలను కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీంతో నవ్యాంధ్ర ఉపాధి కేంద్రంగా అవతరించనుంది. తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గోరంట్లలో తన రెండో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రూ 65 కోట్ల వ్యయంతో నిషా డిజైన్స్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నిషా డిజైన్స్ ఇప్పటికే అంతపురం జిల్లాలోని హిందూపూర్‌లో రూ 700 కోట్ల టర్నోవర్‌తో పరిశ్రమను ఏర్పాటుచేసి 80 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇచ్చింది. ఇంకా అనేక ఐటీ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో దేశంలోనే ఏపీ ఉపాధి కేంద్రంగా మారబోతోంది.