ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో సాగు, తాగునీటికి కొరతే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రభుత్వం సాగునీటికి, తాగునీటికి కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందించగలుగుతుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నదికి జలసిరి హారతినిచ్చారు. అంతకు ముందు ఇండియా నోబుల్ ఇంజనీర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. రాజప్ప మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు జల వనరుల శాఖ ద్వారా 50 ప్రాజెక్టులు రూ.60వేల కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వీటిలో 30 ప్రాజెక్టు పనులు పూర్తి కావచ్చన్నారు. నదులు అనుసంధానం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి రూ.1600 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి కృష్ణానదికి నీరు మళ్లించడం జరిగిందన్నారు. దీని ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రతీ నీటిబొట్టును కాపాడుకుంటూ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో వృధా అయ్యే నీటికి అడ్డుకట్ట వేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమంలో సెప్టెంబర్ 14, 15, 16 తేదీల్లో అన్ని నదుల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మేయర్ పంతం రజనీ శేషసాయి, రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అర్బన్ శాసన సభ్యుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుమిత్‌కుమార్ గాంధీ, జలవనరుల శాఖ ఎస్‌ఈ కృష్ణారావు, ఈఈ మోహన్‌రావు పాల్గొన్నారు.
కరవు జిల్లాలకు గోదావరి నీళ్లు
నెల్లూరు: కరవు జిల్లాలకు గోదావరి నీటిని తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం వద్ద శనివారం జరిగిన జలసిరికి హారతి కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు ప్రణాళికాబద్ధ చర్యలతో ముందుకెళుతోందన్నారు. కరవు జిల్లాలకు గోదావరి నీటిని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. పెన్నా-గోదావరి నదుల అనుసంధానానికి రూ.5వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి టెండర్లు పిలవబోతున్నట్లు స్పష్టం చేశారు. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలోని జలాశయాలన్నింటిని నీటితో నింపామన్నారు. రాష్ట్రంలో చేపట్టిన 57 సాగునీటి ప్రాజెక్టులలో 10 పూర్తయ్యాయని, 2019 నాటికి అన్ని ప్రాజెక్టులు పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఎన్‌ఎస్‌పి కాలువ వద్ద జలసిరికి హారతి
దర్శి: రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రంలో ఎన్‌ఎస్‌పి కాలువ వద్ద జలసిరికి హారతి కార్యక్రమంలో మంత్రి శిద్దా పాల్గొని సాగర్ నీటికి పూజలు నిర్వహించారు.

చిత్రాలు.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరికి పూజలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
*నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి హారతి ఇస్తున్న మంత్రులు సోమిరెడ్డి, నారాయణ