ఆంధ్రప్రదేశ్‌

సీఎంకు అరెస్ట్ వారెంట్‌తో బీజేపీకి సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి వచ్చిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు. ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2010వ సంవత్సరంలో బాబ్లీ ప్రాజెక్టుపై మరో ప్రాజెక్టు కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని, ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబుతో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేసిందన్నారు. ఈ కేసును తిరిగి బీజేపీ కావాలనే కుట్రపూరితంగా పైకి తీసుకువచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పించారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం కోర్టుకు హాజరుకాకపోవడం వల్లనే వారెంట్ జారీ చేశారే తప్పా కక్ష సాధించాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం అనైతికం అన్నారు. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు, మరో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ సారూప్యత లేని పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చాయన్నారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అభివృద్ధే ప్రధానంగా ముందుకు వెళుతుంటే దేశ ప్రధాని మోదీని ఓడించాలనే ప్రయత్నం తప్పా ఆ పార్టీలకు మరోకటి లేదన్నారు.