ఆంధ్రప్రదేశ్‌

వైకాపా అధికారంలోకి వస్తే అవినీతిపరుల అంతుచూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 16: వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల అంతు చూస్తామని, రూ. 4 లక్షల కోట్లు స్వాహా చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు చంద్రబాబు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని, అయితే ప్రతిపక్ష నేత హోదాలో ఆ ప్రాజెక్టును చూసేందుకు వెళ్లిన ఆయనపై అక్కడి పోలీసులు పెట్టింది కేవలం చెత్త కేసన్నారు. ఈ కేసు విషయంలో శిక్ష కూడా పడదన్నారు. నీతి, నిజాయితీపరుడినని, తనను అరెస్టు చేస్తే రాష్ట్భ్రావృద్ధే ఆగిపోతుందంటూ బాబు, ఆయన అనుచరులు హడావుడి చేస్తుండటం హాస్యాస్పదమన్నారు. ఈ కేసులో బాబును ఇరికించింది వైకాపా, బీజేపీలేననడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా కోసం, మైనింగ్, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ప్రతిపక్షాలపై లెక్కలేనన్ని కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే తనవారిపై ఉన్న క్రిమినల్ కేసులన్నింటినీ ఎత్తివేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ సీఎంపై కేసులు నమోదు చేయడం మొదలుపెడితే లక్షల్లో పెట్టాల్సి వస్తుందన్నారు. పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన మరణాలకు బాబుపై కేసులు నమోదు చేయాలన్నారు.
ఓటుకు నోటు, పోలవరం నిర్మాణంలో వేల కోట్లు స్వాహా చేయడం, పట్టిసీమ, పురుషోత్తపట్నంలో అక్రమాలు, రాజధాని భూకుంభకోణం, కాల్‌మనీ కేసులో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, వనజాక్షి కేసు, వైకాపా నాయకుడు నారాయణ హత్య కేసు ఇలా చెప్పుకుంటూ పోతే బాబుపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేయాలన్నారు. కాపుల ఉద్యమం సమయంలో తునిలో రైలును, రాజధాని వద్ద పొలాలను తగులబెట్టించింది కూడా చంద్రబాబేనని కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానం పంపిన సమన్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని బాబు ఆపాదించడం చూస్తుంటే న్యాయవ్యవస్థను అవమానపరిచేదిగా, అనుమానించేదిగా ఉందన్నారు. ప్రతి అంశాన్ని తన స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం బాబుకు ఆనవాయితీగా మారుతోందన్నారు. బాబు ఆటలు ఇక సాగవన్నారు. బాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎంవిఎస్ మణి, షఫీ అహ్మద్ ఖాదరీ తదితరులు పాల్గొన్నారు.