ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ప్రపంచ స్థాయి బీచ్ వాలీబాల్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: విశాఖ నగరం మరో అంతర్జాతీయ క్రీడకు వేదక కాబోతోంది. బీచ్ వాలీబాల్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది వాలీబాల్ (ఎఫ్‌ఐవీబీ) బీచ్ వాలీబాల్ ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచంలోని 56 దేశాల్లో ఈ బీచ్ వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. భారత దేశంలో కూడా జనవరి 17 నుంచి 20 వరకూ బీచ్ వాలీబాల్ టోర్నీని నిర్వహించడానికి జర్మనీ బృందం ప్రతిపాదించింది. భారత దేశంలో మొట్టమొదటి బీచ్ వాలీబాల్ టోర్నీని విశాఖలో నిర్వహించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నట్టు ఎఫ్‌ఐవీబీ గుర్తించింది. ఆ సంస్థ ప్రతినిధులు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్‌ఐ), ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ (ఏపీవీఏ) ఈ క్రీడల నిర్వహణకు కావల్సిన సాంకేతిక, వౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చాయి. దీంతో విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో జనవరి 17 నుంచి 20 వరకూ బీచ్ వాలీబాల్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించి ఏపీ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు వివరాలను అందచేశారు.బీచ్ వాలీబాల్ పోటీల్లో ఒక్కో జట్టులో ఇద్దరేసి క్రీడాకారులు మాత్రమే ఉంటారు. ప్రపంచంలోని 56 దేశాల్లో ఈ పోటీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఆయా దేశాల్లో ఛాంపియన్‌లుగా నిలిచిన జట్లు విశాఖలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటాయి. ఈ టోర్నీలన్నింటిలో విజేతగా నిలిచిన వారికి ఎనిమిది మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. ఎఫ్‌ఐవీబీ బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్‌కు మన దేశంలో కోల్‌కతాకు చెందిన లీజర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తుందని గణబాబు తెలియచేశారు. దీనికి సంబంధించి న్యూ ఈవెంట్స్ బిజినెస్ డైరక్టర్ ఆంగ్లో స్కుయో మాట్లాడుతూ వాలీబాల్ క్రీడకు భారత దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని న్నారు. ఈ క్రీడలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారులు ఈ దేశంలో ఉన్నారన్నారు. పర్యాటక నగరాల్లో బీచ్ వాలీబాల్‌ను నిర్వహించాలని తాము భావిస్తున్నామని, దీనివలన పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. క్రికెట్, హాకీ మాదిరి బీచ్ వాలీబాల్‌కు కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్ననది తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు నిర్వహిస్తున్న బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్ ఎఫ్‌ఐవీబీ చరిత్రలోనే ఒక పెద్ద ఈవెంట్‌గా నిలిచిపోతుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, లీజర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్.దాస్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.