రాష్ట్రీయం

సకాలంలో లక్ష్యాలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో సకాలంలో లక్ష్యాలను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వర్షం లేనప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఉండవల్లి ప్రజావేదికలో సోమవారం రాత్రి పోలవరంతో పాటు భారీ నీటిపారుదల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ఎడమ కాల్వ పనుల్లో వేగం పెంచాలన్నారు. కట్టడాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలంటే పనుల్లో వేగం పెంచాల్సిందే అన్నారు. సమన్వయ లోపంతో సకాలంలో పూర్తిచేయాల్సిన పనుల్లో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుని ముందుకు సాగాలన్నారు. మీరడిగిన నిధులు అందిస్తున్నాం..పనులు వేగవంతం చేయటం కూడా అంతే ముఖ్యమని స్పష్టంచేశారు. ప్రాధాన్య ప్రాజెక్టులలో ప్రతి ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేసి మైలురాయిగా నిలిచిపోవాలన్నారు. ఉన్న వనరులను వినియోంచుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. గతవారంలో పూర్తయిన పనులు 58.15 శాతం కాగా ఈ వారం 0.23 శాతం జరిగాయని దీంతో కలుపుకుని వారాంతానికి 58.38 శాతంతో పాటు హెడ్ వాటర్ వర్క్స్ పనులు 45.51, మెయిన్ డ్యామ్ ప్యాకేజీ 44.26, తవ్వకం పనులు (స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్ మొత్తం 77.9 శాతం పూర్తయిందని అధికారులు వివరించారు. కాంక్రీట్ (స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్‌ఛానల్, క్రివైసిస్ ఫిల్లింగ్) పనులు 37.3 శాతం, రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ 61.83, డయాఫ్రం వాల్ 1397 మీటర్లు నూరు శాతం, జెట్ గ్రౌటింగ్ 94.2 శాతం కనెక్టివిటీ 59.04, లెఫ్ట్ కనెక్టివిటీస్ 47.79, రైట్ కనెక్టివిటీస్ 71.77 శాతం కుడి ప్రధాన కాలువ పనులు 90శాతం, ఎడమ ప్రధాన కాల్వ పనులు 63.71 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పనులు ఆలస్యం చేయటం సరికాదని ముఖ్యమంత్రి మందలించారు. ఎర్త్‌వర్క్‌లో 150 టిప్పర్లు, 28 పొక్లెయినర్లు పనులు నిర్వహిస్తున్నాయని, అదనంగా మరో 130 టిప్పర్లు తెప్పించామని అధికారులు తెలిపారు. గత మూడు, నాలుగు నెలలుగా వారానికి 30వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తి చేశామన్నారు. వారానికి 9వేల క్యూబిక్ మీటర్ల లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అక్టోబర్‌లో 2.5లక్షల క్యూబిక్ మీటర్లు, నవంబర్‌లో మరో 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేయాలని చీఫ్ ప్రాజెక్టు ఇంజనీర్ శ్రీ్ధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్ నాటికి భూ సేకరణ పూర్తిచేయాలని రానున్న 12 వారాల్లో ఆర్థిక లక్ష్యాలు నెరవేరాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు సీఎం సూచించారు.
బిల్లుల క్లియరెన్స్‌లో చూపుతున్న చొరవ పట్ల ఎల్ అండ్ టి బావర్ కంపెనీ ప్రతినిధి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు అప్‌డేట్ చేయాలని సీఎం సూచించారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి కావాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రారంభోత్సవానికి ఐదు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గోరుకల్లు రిజర్వాయర్ (శ్రీ నరసింహరాయసాగర్), అవుకు టనె్నల్, పులికనుమ ఎల్‌ఐ స్కీమ్, పెదపాలెం ఎల్‌ఐ స్కీమ్, కేఎల్‌రావు సాగర్ (పులిచింతల) సిద్ధంగా ఉన్నాయన్నారు. మదనపల్లె, పుంగనూరు, చెర్లపల్లి, మరాల ప్రాజెక్టులు మొదటి దశలో ప్రారంభం కావాలని, గొల్లపల్లి, మడకశిర, ప్రాజెక్టులు తర్వాతి దశలో ప్రారంభించాలని నిర్దేశించారు. ఈనెల 21వ తేదీన రాయలసీమలో గోరుకల్లు, పులికనుమ, గండికోట ప్రాజెక్టులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నాగావళి, వంశధార పురోగతిని జిల్లా అధికారులను టెలీకాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. వంశధార- నాగావళి ప్రాజెక్టులను డిసెంబర్‌లో పూర్తిచేయాలని ఆదేశించారు. గుండ్లకమ్మ, కొరిశపాడు, వెలిగొండ ప్రాజెక్టులను కూడా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. నాగావళి, వంశధార పనులను డిసెంబర్ 31వ తేదీ నాటికి ఆఫ్‌షోర్ పనులు పూర్తిచేసి అంచనాలు క్లియర్‌చేయడం ద్వారా ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలన్నారు. వచ్చేనెల మొదటి వారం నాటికి అన్ని ఏజన్సీలలో కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ పోలవరం ఇంజనీర్ ఇన్‌చీఫ్ తదితరులు పాల్గొన్నారు.