ఆంధ్రప్రదేశ్‌

2019లోగా హైడ్రోజన్ రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: హైడ్రోజన్ రైలు తయారీలో జర్మనీ మాత్రమే కాదు భారత్ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. 2019 సంవత్సరం ముగిసే లోగా హైడ్రోజన్ ఇంధన అధారిత రైలును పట్టాలెక్కించేందుకు శ్రమిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ, చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ల మధ్య గత ఫిబ్రవరి 24న జరిగిన అవగాహన ఒప్పందం మేరకు పరిశోధనలు వేగవంతమయ్యాయి. నార్త్ జర్మనీ శాస్తవ్రేత్తలు తొలి హైడ్రోజన్ రైలును తయారు చేసి సోమవారం లాంఛనంగా ప్రారంభించడంతో ఎస్‌ఆర్‌ఎం, ఐసీఎఫ్‌ల సంయుక్త పరిశోధనలకు ప్రాధాన్యత పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎంవోయూలో పేర్కొన్న ప్రకారం వచ్చే మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి 2019 డిసెంబర్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ ప్రొ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీ నారాయణరావు మంగళవారం పేర్కొన్నారు. ఒక రైలింజన్, రెండు బోగీల్లో 130 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా 100 హార్స్‌పవర్ సామర్థ్యంగల రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిచేలా తీర్చిదిద్దనున్నారు. దీనికి ‘జల్ జనక్ రైలు’గా పేరు పెట్టారు. ఈ సరికొత్త రైలు తయారీకి సంబంధించిన పనులు చెన్నైలోని ఐసీఎఫ్‌లో ఊపందుకున్నాయి.