ఆంధ్రప్రదేశ్‌

కదలిన కాంగ్రెస్ దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 18: రాష్ట్ర విభజనతో నాలుగేళ్ల క్రితం కుదేలైన కాంగ్రెస్ మరోమారు గర్జించింది. రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో నిర్వహించిన తొలి సభ నేతలు ఊహించిన దాని కంటే విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలు ఆనందడోలికల్లో మునిగితేలుతున్నారు. కర్నూలులో ‘సత్యమేవ జయతే’ పేర మంగళవారం జరిగిన సభకు కాంగ్రెస్‌కు దూరమైన అభిమానులు, కార్యకర్తలు దండులా కదిలిరావడంతో కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా వారే కనిపించారు.
ఎస్టీబీసీకళాశాల మైదానం జనంతో కిక్కిరిసిపోవడంతో రహదారులపైనే ప్రజలు నిల్చొని రాహుల్ చెప్పేది విన్నారు. రాహుల్ గాంధీ ఈ ఏడాది మే నెలలోనే రాష్ట్రానికి రావాలని నిర్ణయించుకుని కర్నూలులో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. అయితే అనివార్య కారణాలతో ఆ నెలలో సభ నిర్వహణ వీలు కాలేదు. దాంతో ఆగస్టులో మరో మారు నిర్వహించడానికి సిద్ధపడ్డారు. అయితే కేరళలో భారీ వరదల కారణంగా రాహుల్ రావడానికి వీలు కాలేదు. చివరగా మంగళవారం నిర్వహించారు. ఈ సభ నిర్వహించాలని గత నెల 19వ తేదీన అధికారికంగా నిర్ణయమైంది. దీంతో పార్టీ సీనియర్ నాయకుడు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి సభను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనకు తోడుగా మూడు నెలల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తోడయ్యారు.
కోట్ల కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంపై, బైరెడ్డి నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిలు అనుబంధ సంఘాల నాయకులను కలుపుకుని ప్రజల్లోకి వెళ్లారు.
వారిద్దరూ గత నెల రోజులుగా ప్రతి రోజు గ్రామాలకు వెళ్లి రాహుల్ సభకు రమ్మంటూ పార్టీ తరఫున ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని ప్రజలకు వివరించారు.
వారి శ్రమ ఫలించి సత్యమేవ జయతే సభ విజయవంతం కావడం, వారునుకున్న విధంగా సభకు ప్రజలు తరలిరావడంతో వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. నగరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిండిపోవడం, రాహుల్ నగరంలోని పలు ప్రాంతాల్లో తిరగడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. కాంగ్రెస్ బలపడితే అది తమకు లాభిస్తుందని, వైకాపాకు అధికారం దూరం చేస్తుందని భావించిన టీడీపీ నేతలు కాంగ్రెస్ సభ విజయవంతం కావడంతో తమకు కూడా నష్టం తెస్తుందేమోనన్న ఆలోచనలో పడ్డారు. జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్న వైకాపా కాంగ్రెస్ సభను చూసిన తరువాత విజయం అంత సులభం కాదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. సత్యమేవ జయతే విజయం కారణంగా టీడీపీ, వైకాపా మరింత శ్రమించాల్సిన పరిస్థితులు ఉంటాయని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.