ఆంధ్రప్రదేశ్‌

‘పంచ గ్రామాల’పై చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: సింహాచలం పంచ గ్రామాల సమస్య దాదాపూ మూడు, నాలుగు దశాబ్దాలుగా కొనిక్కిరాని భూ సమస్య. సింహాచల దేవస్థానానికి, భూ ఆక్రమణదారులు, హిందూ ధార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఈ సమస్య ఎప్పటికైనా కొలిక్కి వస్తుందా అని పంచ గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటే, తేనె తుట్టెను కదపడమేనని గత ప్రభుత్వాలన్నీ వౌనంగా ఉండిపోయాయి. అయితే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో ఈ విషయంలో ప్రభుత్వం వడివడిగా అడగులు వేసినా, ఆ తరువాత చతికిలపడిపోయింది. ఈ సమస్యను ఏ పార్టీ పరిష్కరిస్తే, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎదురుండదు. అయితే, తొలి అడుగు వేయడమే కష్టంగా ఉన్న దశలో ప్రభుత్వం ఏమాలోచించిందో ఏమో కానీ, స్థానిక మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఈ ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అమరావతిలో బుధవారం జరగనుంది.
ఇదీ! పంచ గ్రామాల సమస్య
పైన పేర్కొన్న ఐదు నియోజకవర్గాల్లో సింహాచల దేవస్థానం భూమి విస్తరించి ఉంది. 1996 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 9,069 ఎకరాల భూమిని సింహాచల దేవస్థానానికి చెందుతుందని రైతువారీ పట్టా ఇచ్చింది. అప్పటికే ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకుని గృహాలను నిర్మించుకున్నారు. వీటిని రెగ్యులరైజ్ చేయాలంటూ వీరు ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో 2000 ఆగస్టు 19వ తేదీన ప్రభుత్వం 578 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం 1998 రిజస్టర్ వాల్యూ ప్రకారం కమర్షియల్ ప్రాంతంలోని నిర్మాణాల రెగ్యులరైజేషన్‌కు బుక్ వాల్యూలోని ధరను 100 శాతం చెల్లించాలని, అలాగే, డొమెస్టిక్ ఏరియాలోని నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడానికి బుక్ వాల్యూలోని 70 శాతం మొత్తాన్ని చెల్లించాలి. దీని ప్రకారం 2004 ఏప్రిల్ 30వ తేదీ వరకూ 2400 మంది రెగ్యులరైజ్ చేయించుకున్నారు. అప్పటికీ మరికొంతమంది రెగ్యులరైజ్ చేయించుకోలేదు. 2012లో ఓసారి సర్వే చేసినప్పుడు ఈ అక్రమ నిర్మాణాలు 10 వేల వరకూ చేరుకున్నాయి. తాజాగా 20 వేల వరకూ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నింటిని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇవీ అడ్డంకులు!
* దేవస్థానం భూముని ఎట్టి పరిస్థితుల్లోను విక్రయించడానికి వీల్లేదంటూ హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు కోర్టులో కేసులు వేశారు. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. వీటిని ముందుగా పరిష్కరించాలి. వీటితోపాటు తమ భూములను రెగ్యులరైజ్ చేయాలంటూ కొంతమంది కేసులు వేశారు. ఇలాంటి వందలాది కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
* గత 10 సంవత్సరాలుగా సింహాచల దేవస్థానం భూముల క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. గతంలో భూమిని ఆక్రమించుకున్న వారి పేర్లు దేవస్థానం రికార్డుల్లో నమోదై ఉన్నాయి. ఆ తరువాత ఆయా వ్యక్తులు తమ భూములను వేరే వారికి విక్రయిస్తున్నట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. కనీసం వీటినికి కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో ఒకవేళ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలంటే ఎవరి పేరున జరగాలన్న మీమాంశ తలెత్తుతోంది. 2008నాటికి ఆక్రమిత స్థలాలు ఎవరి పేరున ఉన్నాయో, వారిపేరునే రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. దీని తరువాత ఆయా స్థలాలు పెద్ద ఎత్తున చేతులు మారిపోయాయి. గతంలో చాలా తక్కువ ధరకు భూ లావాదేవీలు అనధికారికంగా జరిగాయి. ఇప్పుడు భూముల ధరలు గణనీయంగా పెరిగినందువలన క్రయ, విక్రయదారుల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది.
* గిల్‌మేన్ సర్వే ప్రకారం ఆయా భూములపై దేవస్థానానికి ఎంత అధికారం ఉందో, తమకూ అంతే హక్కు ఉందంటూ రైలు వాదిస్తున్నారు. ఆ మాటకు వస్తే గిల్‌మేన్ సర్వేకు ఆథరైజేషన్ లేదని దేవస్థానం అధికారులు చెప్పుకొస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత తీసుకోవలసిన అవసరం ఉంది.
* 2008 నాటికి ఆక్రమిత స్థలాలనే రెగ్యులరైజ్ చేస్తే, అంతకు మూడింతలుగా పెరిగిపోయిన ఆక్రమణల మాటేంటి? దేవస్థానం భూ ఆక్రమణలపై నిషేధం కొనసాగుతున్న సమయంలో కూడా వేల సంఖ్యలో ఆక్రమణలు జరుగుతున్న దేవస్థానం ఏం చేస్తోందన్న ప్రశ్న వస్తోంది.
ఇవీ పరిష్కార మార్గాలు!
* ముందుగా కోర్టులో ఉన్న కేసులు విత్ డ్రా అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 2014లో బాబు అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి ఉంటే, ఇప్పటికి కొంత సమస్య పరిష్కారమయ్యేది. ఆ తరువాత ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అయినా, ప్రజల మధ్యకు వచ్చి అభిప్రాయాలను సేకరించి ఉంటే, పంచ గ్రామాల సమస్యపై కదలిక వచ్చిందన్న ప్రజలు సంతృప్తి చెందేవారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పంచ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, అభిప్రాయాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది.
* రెగ్యులరైజేషన్‌కు సంబంధించి స్పష్టమైన గైడ్‌లైన్స్ జారీ చేయాల్సిన అవసరం ఉంది.
* ఆక్రమిత దేవస్థానం భూమిలో ఉన్న నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసి, ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ వేసి దేవస్థానానికి అప్పగిస్తామని ప్రభుత్వం చెపుతోంది.
* అష్టదిగ్బంధంలో ఉన్న ఈ పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికైనా ఉపక్రమించింది. అయితే, ఏ కోణంలో ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపుతుందో వేచి చూడాల్సిందే.