ఆంధ్రప్రదేశ్‌

జగన్ సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తారా: డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించడమంటే ప్రజా సమస్యలను విస్మరించడమేనని శాసనమండలి చీఫ్ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అనేక సమస్యలపై చర్చ జరుగుతోందని, ప్రతిపక్ష నేత, విపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజలు గెలిపించింది వారి సమస్యల పరిష్కారం కోసమే తప్ప స్వప్రయోజనాలు చూసుకోవడానికి కాదని వైసీపీ ఎమ్మెల్యేలు గుర్తెరగాలని హితవుపలికారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టరా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు యువనేస్తం పథకం కింద 1000 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీంతో 10 లక్షల మంది లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, బహిష్కరణలు సరికాదని, అధికారపక్షమైనా, విపక్షమైనా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి పనులు ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు తమ సలహాలు, సూచనలు అందించాలే తప్ప రాజకీయాలు చేయడం సరికాదన్నారు.