ఆంధ్రప్రదేశ్‌

ప్రతి సీటు గెలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: వచ్చే ఎన్నికల్లో ప్రతి సీటు ప్రధానమే.. అన్ని నియోజకవర్గాల్గో గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాల అనంతరం బుధవారం అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయంలో లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి సీటులో గెలుపు సవాల్‌గా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం, పార్టీపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతినెలా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరును విశే్లషిస్తున్నా.. ప్రజలతో వినయంగా ఉండాలని.. కార్యకర్తలను గౌరవంగా చూడాలన్నారు. ప్రతిపక్షంపై కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రజలతో సాన్నిహిత్యం, కార్యకర్తల పట్ల గౌరవం, ప్రతిపక్షంతో కఠినంగా వ్యవహరించటం నాయకత్వ లక్షణాలని వివరించారు. ఇవి లేకపోతే పార్టీకి భారంగా మారతారన్నారు. అతిగా వ్యవహరించినా, మందకొడిగా ఉన్నా నష్టాలే అన్నారు. ఏ కొందరు నాయకుల వల్లో పార్టీకి చెడ్డ పేరు రాకూడదన్నారు. ఒక నియోజకవర్గంలో తప్పు జరిగినా ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పార్టీపై పడుతుందని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి నష్టం కలిగిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. విశ్వసనీయత అనేది రాత్రికి రాత్రే రాదని కొనే్నళ్లు, దశాబ్దాల కష్టం ప్రజల్లో మన పట్ల విశ్వసనీయతకు కొలమానమని ఉద్ఘాటించారు. ఈ పరిస్థితుల్లో ఏ తప్పుచేసినా దశాబ్దకాల కష్టం నిరుపయోగంగా మారుతుందని హితవు పలికారు. ప్రతిపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆరోపణలు నిగ్గుతేల్చకపోతే నిజాలని భ్రమపడే ప్రమాదం ఉందని ఇంటింటికీ వెళ్లి ఆత్మీయంగా పలుకరించాలన్నారు. కార్యకర్తలు, సానుభూతిపరులు అందరి ఇళ్లపై ‘మళ్లీ నువ్వే రావాలి.. పార్టీ జెండాలు ఎగరాలన్నారు. జయహో బీసీ’ సదస్సుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన చర్చల్లో సభ్యుల భాగస్వామ్యంపై విశే్లషణ వివరాలను తెలియజేశారు. మీడియా పాయింట్‌లో ఇద్దరు ముగ్గురు నాయకులే మాట్లాడటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. బుద్ధా వెంకన్న స్వల్పకాలంలోనే వక్తగా ప్రతిభ పెంచుకున్నారని కితాబిచ్చారు. శాసనసభలో సబ్జక్టు ప్రజంటేషన్, బెస్ ఎల్‌ఏక్యూ, బెస్ట్ ఇంటర్వెన్షన్, బెస్ట్ పొలిటికల్ పంచ్‌లను ఈ సందర్భంగా గుర్తించారు. ఇంత అనుభవం ఉన్నప్పటికీ రెండు, మూడు గంటలు హోంవర్క్ చేస్తున్నానని మీరు కూడా అది అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. శాసనసభ కౌన్సిల్ సమావేశాలు ముగిసాయి.. వారంరోజులు అర్థవంతమైన చర్చ జరిగింది.. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం.. నదుల అనుసంధానం..గ్రామదర్శిని, పేదల సంక్షేమం నాలుగేళ్ల అభివృద్ధి, కేంద్ర వివక్షత, ఏపీ పునర్విభజన చట్టం అమల్లో నిర్లక్ష్యం అన్నింటిపై సమగ్రంగా చర్చించాం.. ప్రతిపక్షం లేకున్నా సభ బాగా జరిగిందనే సందేశం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ఇక నిరంతరం ప్రజల్లో ఉండాలని నిర్దేశించారు. గ్రామ వికాసం, వార్డు వికాసం కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. ప్రతిరోజు పనితీరును విశే్లషించు కోవాలన్నారు. గ్రామ వికాసం కార్యక్రమం కింద ఇప్పటి వరకు 22 శాతం మాత్రమే పూర్తయిందని, వచ్చే మూడు నెలల్లో నూరు శాతం పూర్తిచేయాలన్నారు. గ్రామ వికాసంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాం పెరగాలన్నారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, శాసనసభ, శాసనమండలి విప్‌లు పల్లె రఘునాధరెడ్డి, పయ్యావుల కేశవ్, తదితరులు పాల్గొన్నారు.