ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి రండి... చూసి పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: ఏపీకి రావాలని, ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు, చేసిన అభివృద్ధి చూసి నచ్చితే పెట్టుబడులు పెట్టాలని చైనాలోని పారిశ్రామివేత్తలకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా టియాన్జిన్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో బుధవారం లోకేష్ మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న అభివృద్ధి వివరించారు. కొరియాకు చెందిన జిఎస్ గ్లోబల్ ప్రెసిడెంట్ సీయాహాంగ్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్‌వే అని అభివర్ణించారు. ఏపీలో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహించేందుకు రావాలని మంత్రి కోరారు. త్వరలో ఏపీకి వస్తామని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనువైన రంగాలను గుర్తిస్తామని సీయాహాంగ్ హమీ ఇచ్చారు. అనంతరం హెచ్‌పి కంపెనీ చీఫ్ ఆర్కిటెక్ట్ క్రిక్‌తో సమావేశమయ్యారు. ఏపీలో అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్సు గురించి మంత్రి వివరించారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా అనలిటిక్స్‌లో సహకారం కావాలని కోరారు. త్వరలోనే ఏపీకి వచ్చిన ఆర్టీజీని సందర్శిస్తామని క్రిక్ తెలిపారు. ఏపీకి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఏపీ వేదిక కానుందని, దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారం కావాలని మంత్రి కోరారు. సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ మూరత్, మెంబర్ ఆఫ్ మేనేజింగ్ బోర్డు సరిత, సభ్యుడు హ్యారిసన్‌లతో మంత్రి చర్చించారు. కనబడే పాలన... కనిపించని ప్రభుత్వం అనే లక్ష్యంతో కాగిత రహిత పాలన, ఈ- క్యాబినెట్, ఆర్టీజీలను అమలు చేస్తున్నామని వివరించారు. 10 లక్షల ఐవోటీ పరికరాలు వినియోగిస్తూ, రియల్ టైమ్‌లో సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. బిగ్ డేటా, ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఐవోటీలో ఫోరం సహకారం కావాలన్నారు. 4వ పారిశ్రామిక విప్లవానికి సంబంధించి త్వరలో ఇండియాలో శాటిలైట్ సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని ఆ బోర్డు ప్రతినిధులు తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు, ఫోరం సమావేశానికి హాజరైన ప్రతినిధులకు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, కల్పిస్తున్న రాయితీలు, వౌలిక సౌకర్యాల గురించి మంత్రి వివరించారు. రాష్ట్ర విభజన తరువాత పెట్టుబడులకు గేట్‌వేగా ఎదుగుతున్నామని, సింగపూర్ అందించిన మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. ఏపీలో మరో ఆరు పోర్టులు నిర్మించనున్నామని, రాష్ట్రంలో 100 ఎకనామిక్ సిటీలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెగా ఫ్యాక్టరీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు. వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని అనుసంధానం చేసి, గ్రామాల అభివృద్ధికి టెన్ స్టార్ రేటింగ్ అమలు చేస్తున్నామన్నారు. డేటా అనలిటిక్స్ ద్వారా స్కూల్ డ్రాప్ అవుట్లను ముందుగానే గుర్తిస్తామన్నారు. వివిధ రంగాల్లో ఆర్ట్ఫీషియల్ ఇంటెలిజెన్సును ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చే వీలు ఉందన్నారు. నీటి నాణ్యతను సెన్సర్ల ద్వారా తెలుసుకుంటున్నామని, వీధీ లైట్ల నిర్వహణకు సిసిఎంఎస్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. డ్యాష్ బోర్డు ఏర్పాటు ద్వారా వివిధ శాఖల మధ్య పోటీ పెరిగి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఒకే సమాచారం, సర్ట్ఫికెట్లు లేని పాలన కోసం ఈ-ప్రగతి కార్యక్రమం ప్రారంభించామన్నారు. డేటా అనలిటిక్స్, టెక్నాలజీ వినియోగం ద్వారా 18 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా, 24 శాతం మేర వృద్ధి సాధించామని వివరించారు.