ఆంధ్రప్రదేశ్‌

హిందుస్తాన్ షిప్‌యార్డుకు భారీ మొత్తంలో ఆర్డర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: విశాఖలోని హిందుస్తాన్ షిప్‌యార్డుకు ఈ గురువారం సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. చాలా కాలం తరువాత భారీ ఆర్డర్ లభించింది. అంతేకాదు, ఈ షిప్‌యార్డు తయారు చేసిన పలు టగ్స్‌ను కూడా గురువారం జలప్రవేశం చేయించడం గమనార్హం. భారత నౌకాదళానికి అవసరమైన రెండు డైవింగ్ సపోర్ట్ వెసల్స్‌ను తయారు చేసే బాధ్యతను రక్షణ శాఖ ఈ షిప్‌యార్డుకు అప్పగించింది. ఈ వెసల్స్‌ను తయారు చేసేందుకు జరిగిన టెండర్ ప్రక్రియలో దేశంలోని పబ్లిక్, ప్రైవేటు రంగంల్లో ఉన్న పలు షిప్‌యార్డులు పోటీ పడ్డాయి. చివరకు హిందుస్తాన్ షిప్‌యార్డు ఈ బిడ్‌ను దక్కించుకుంది. ఈ డైవింగ్ సపోర్ట్ వెసల్స్ తయారు చేయడానికి రెండు వేల కోట్ల రూపాయలను రక్షణ శాఖ ఖర్చు చేయనుంది. ఈమేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో షిప్‌యార్డు సీఎండీ వైస్ అడ్మిరల్ ఎల్.వీ.శరత్‌బాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అలాగే, హిందుస్తాన్ షిప్‌యార్డు భారత నావికాదళం కోసం నిర్మించిన పది టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు బొలార్డ్ పుల్ టగ్స్‌ను గురువారం నేవీకి అంద చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ అధికారులు పాల్గొన్నారు. అలాగే 50 టన్నుల సామర్థ్యం కలిగిన బొలార్డ్ పుల్ టగ్ కృత్తికను గుజరాత్‌లోని దీన్‌దయాళ్ పోర్టు ట్రస్ట్‌కు గురువారం అందచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో హిందుస్తాన్ షిప్‌యార్డు జలప్రవేశం చేయించిన రెండు నౌక ఇది. 12 నాటికిల్ మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ నౌకను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.