ఆంధ్రప్రదేశ్‌

జేసీ దివాకర్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 20: పోలీసులపై అసభ్యకర పదజాలం వాడి, మనోభావాలను కించపరిచిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం డిమాండు చేసింది. తాడిపత్రి చినపొడమాల ఘటనలో పోలీసులు ఘోర వైఫల్యం చెందారంటూ వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డి తన ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడం సరికాదని ఏపీ పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడ అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఒక బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యుడు జేసీ చేసిన వ్యాఖ్యల వల్ల వీగిపోయాయని అన్నారు. పోలీసులపై ఆయన ఆరోపణలు ముఖ్యమంత్రి ఆశయాన్ని దెబ్బతీస్తోందన్నారు.
పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేస్తూ సమాజ శాంతికి నిరంతరం శ్రమిస్తూ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న పోలీసులను దివాకర్‌రెడ్డి మాటలు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయన్నారు.