ఆంధ్రప్రదేశ్‌

‘3000’కు చేరువగా ప్రజా సంకల్పయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర అవిఘ్నంగా కొనసాగుతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ పాదయాత్ర సాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సుమారు 3000 కిలో మీటర్ల పాదయాత్ర జరపాలని జగన్ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇంకా రెండు జిల్లాలు మిగిలి ఉండగానే జగన్ తన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా గురువారం పాదయాత్రను రద్దు చేశారు. శుక్రవారం పాదయాత్ర జరగదు. తిరిగి శనివారం జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా నుంచి ఆరంభమవుతుంది. ఈ పాదయాత్ర విజయనగరం జిల్లా ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలస గ్రామానికి చేరుకునేప్పటికి జగన్ 3000 కిలో మీటర్ల మైలు రాయి చేరుతుంది. ఈ సందర్భంగా అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించనున్నట్టు వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలియచేశారు. గురువారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 267 రోజులుగా సాగుతున్న జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.
జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి అధికార టీడీపీ అర్థం లేని ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తోందన్నారు. విశాఖ జిల్లాలో పాదయాత్రకు జనం భారీ సంఖ్యలో వచ్చారన్నారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలసకు చేరుకోగానే మూడు వేల కిలో మీటర్ల పైలాన్‌ను జగన్ ఆవిష్కరించి, అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగిస్తారని రఘురాం చెప్పారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో వైసీపీ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.