ఆంధ్రప్రదేశ్‌

స్టాండింగ్ కమిటీలో వేమిరెడ్డికి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 20: నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘంలో సభ్యునిగా నియమించినట్లు రాజ్యసభ సచివాలయం నుండి గురువారం ఆయనకు ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ తనకు సభ్యునిగా అవకాశం కల్పించినందుకు రాజ్యసభ చైర్‌పర్సన్ వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలియచేశారు. తనపై నమ్మకముంచి తనకు అప్పగించిన అత్యున్నతమైన బాధ్యతను సక్రమంగా నెరవేరస్తానని, ఈ కమిటీ ద్వారా దేశ భద్రత, రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతలు, రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన అన్ని విషయాలపై జరగబోయే కమిటీ సమావేశాల్లో చర్చించి, న్యాయం జరిగేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాకలు సంబంధించి అంశాలపై రాజీలేని పోరాటం చేస్తానని ముఖ్యంగా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా వేమిరెడ్డి హామీనిచ్చారు.