ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో టీసీఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: తిరుపతిలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు చైనాకు చెందిన టీసీఎల్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు చైనాలోని షేనే్జన్లోలో ఆ కంపెనీ సీఈవో కెవిన్ వాంగ్‌తో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ గురువారం భేటీ అయ్యారు. అనంతరం తిరుపతిలో కంపెనీ ఏర్పాటు వీలుగా ఆ కంపెనీ, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ శాఖల మధ్య ఒప్పందం చేసుకున్నారు. వివిధ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను తయారు చేసే టీసీఎల్ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు రావడం విశేషం. చాలా కాలం క్రితం టీసీఎల్ ప్రతినిధులు ఏపీకి వచ్చారు. వారికి ఏపీలో ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటులో కల్పిస్తున్న రాయితీలు, తదితర అంశాలపై వివరించారు. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో మూడో స్థానంలో ఉన్న టీసీఎల్‌ను ఏపీలో పెట్టుబడులకు ఒప్పించడంలో మంత్రి కృతకృత్యులయ్యారు. అనేక రాయితీలు సహా దేశంలో పని చేస్తున్న మూడు ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఉన్న రాష్ట్రం ఏపీ కావడం కూడా కారణంగా చెప్పవచ్చు ఇండియాలో ప్రతి సంవత్సరం వినియోగిస్తున్న 500 బిలియన్ డాలర్ల విలువైన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్‌లో సగం ఏపీలో తయారయ్యే విధంగా లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామన్నారు. కంపెనీకి విడిభాగాలు సరఫరా చేస్తున్న 15 కంపెనీలను కూడా తీసుకురావాలని కోరారు.