ఆంధ్రప్రదేశ్‌

బుగ్గనకు బుద్ధి మందగించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 21: పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి రానురాను బుద్ధి మందగిస్తోందని, వాస్తవాలు చెప్తున్నా పదే పదే పోలవరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో దినకర్ మాట్లాడుతూ 2011లో పోలవరం అంచనాలు 16 వేల కోట్ల రూపాయలు ఉండగా 2014 నాటికి 54 వేల కోట్లకు పెరిగిన మాట వాస్తవమేనన్నారు. అయితే 2013లో వచ్చిన నూతన భూ సేకరణ చట్టం వలన పోలవరం నిర్వాసితుల పునరావాస అంచనా వ్యయం 3 వేల కోట్ల నుంచి 34 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. బుగ్గన పదేపదే 2011 నాటి అంచనా వ్యయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని, 2014లో ఎందుకు వ్యయం పెరిగిందో మాత్రం చెప్పడం లేదని మండిపడ్డారు. దేశమంతా భూ సేకరణ చట్టం గురించి తెలిసినప్పటికీ బుగ్గనకు తెలియకపోవడం శోచనీయమన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేయించిన చరిత్ర బుగ్గనదని విమర్శించారు. మొన్నటి కాగ్ నివేదికపై వైసీపీ నాయకులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన ధనయజ్ఞాన్ని కాగ్ కడిగి పారేసిన విషయాన్ని బుగ్గన మర్చిపోయినట్లున్నారని అన్నారు. వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస పనులను ప్రారంభించలేదని, కేవలం మట్టిపనులు మాత్రమే చేసి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. పోలవరం హెడ్‌వర్క్స్ డిపిఆర్ లోపభూయిష్టంగా ఉన్నకారణంగానే 2009లో అనుమతులు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 2009 వరకు చూస్తే కాగ్ నివేదిక ప్రకారం జలయజ్ఞంలో 22 శాతం అంచనాలను మాత్రమే చేరుకున్నారని, దానికే 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారని దినకర్ ప్రశ్నించారు. ఆ డబ్బులన్నీ జగన్ సూట్‌కేసుల్లోకి పోయాయని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 150 కోట్లతో శ్రీకారం చుట్టగా ఒక్కపని కూడా ప్రారంభించకుండానే అంచనాలను మళ్లీ 610 కోట్ల రూపాయలకు పెంచారని, ఆ మొత్తాన్ని దోచేశారని అన్నారు. ఈ నాలుగు సంవత్సరాల టీడీపీ పాలనలో లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీరు అందించామన్నారు. పోలవరం పనులు 59 శాతం పూర్తయ్యాయని, కేంద్రం నుంచి ఇంకా 3 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించారు. ప్రస్తుతం కాగ్ వెల్లడించిన నివేదిక అంతా వైఎస్‌ఆర్ హయాంలోనే జరిగిన తప్పుల ఫలితమేనని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్కసుతో 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు బీజేపీ, వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని దినకర్ మండిపడ్డారు.