ఆంధ్రప్రదేశ్‌

25న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాయకాపురం), సెప్టెంబర్ 21: విద్యా రంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పాటిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు ఇచ్చింది. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరిక అశోక్ మాట్లాడుతూ జ్ఞానభేరి పేరుతో ప్రభుత్వం ప్రచారభేరి ప్రారంభించిందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవాలంటే ఫీజుల భారం భారీ స్థాయిలో ఉంటుందనీ, అడ్మిషన్ ప్రక్రియ నుండి పుస్తకాలు, యూనిఫారమ్స్, ట్యూషన్ ఫీజుల పేరుతో లక్షల్లో వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్బన్ ప్రాంతంలో 9,500, రూరల్ ప్రాంతాల్లో 7,500 మాత్రమే వసూలు చేయాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు.