ఆంధ్రప్రదేశ్‌

గాంధీ జయంతి రోజు నుంచి గ్రామస్వరాజ్య పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: సకాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.. పంచాయతీలను రక్షించాలనే డిమాండ్‌పై అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి అమరావతిలో గ్రామ స్వరాజ్య దీక్ష ద్వారా ప్రత్యక్ష పోరుకు సమయాత్తమవుతున్నట్లు ఆయన తెలిపారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ వైపు న్యాయ పోరాటంతో పాటు 13 జిల్లాలోనూ గ్రామస్వరాజ్య పోరాటంతో ప్రజలను చైతన్యపర్చి వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. గ్రామ పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలోనే తొలిసారిగా గత 18 మాసాలుగా కుంటిసాకులతో జనరల్ ఫండ్స్‌పై కూడా ఆంక్షలు విధించారన్నారు. కేంద్రం నుంచి నేరుగా భారీఎత్తున నిధులు వస్తున్నాయనే అక్కసుతో ప్రభుత్వం అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించటం వల్ల గత ఐదేళ్ళలో కనీసం నెల రోజులు కూడా సర్పంచ్‌లు స్వేచ్ఛగా తమ చెక్ పవర్‌ను సద్వినియోగం చేసుకోలేక పోయారన్నారు. ఇక గ్రామీణ ఉపాధి హామీ నిధులపై తొలుత ఆరు మాసాల పాటు ఆంక్షలు, ఆపై కాంప్రెహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ పేరిట సాంకేతిక లోపాలు చూపుతూ సర్పంచ్ వేలి ముద్రలు సక్రమంగా పడటం లేదంటూ తమ పదవీకాలం పూర్తయ్యే వరకు నిధులను డ్రా చేయకుండా అడ్డుకున్నారన్నారు. ఇక మేజర్ పంచాయతీల్లో నిత్యం ఐదు నుంచి 10వేలు వరకు ఖర్చు ఉంటుంది... బోర్లు, విద్యుత్ దీపాలు మరమ్మత్తులు శానిటేషన్ వంటి వాటికీ ఖర్చులను సర్పంచ్‌లే భరించాల్సి వచ్చిందన్నారు. ఇక గ్రామీణ ఉపాధి హామీ పనులు అప్పులతో భేషుగ్గా జరుగటం వల్లనే జాతీయస్థాయిలో మంత్రి లోకేష్ ప్రథమస్థానంలో అవార్డు పొంది ఊరువాడ సత్కరాలు పొందుతుంటే, తమ పదవీకాలం ముగిసిన నాటికీ బిల్లులు పాస్‌కాక సర్పంచ్‌లు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడే స్థితికి చేరుకుంటున్నారని విస్సన్నపేట మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్, చాంబర్ రాష్ట్ర కార్యదర్శి పల్లిపాం లక్ష్యయ్య ఆవేదనతో చెప్పారు. తాము సర్పంచ్‌లుగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలను, ప్రస్తుతం ప్రత్యేకాధికారులను అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాలను కాపాడుకుంటున్నారన్నారు.