ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎలా జత కట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, కొత్తవలస, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీని దుర్భాషలాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇపుడు అదే పార్టీతో ఎలా జతకట్టారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శనివారం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన జగన్ పర్యటన గురించి, టీడీపీ పాలన గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అంకెల గారడీ తప్ప జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. పాలకుల నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీపై బురద జల్లుతున్నారన్నారు. విజయనగరంలో సంగీత కళాశాలను సంగీత అకాడమీగా మార్చుతామన్న హామీ కలగానే మిగిలిందన్నారు. అలాగే గిరిజన వర్శిటీ ఏర్పాటు చేస్తామని నేటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అతీగతి లేదన్నారు.
ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు ఊసెత్తలేదన్నారు. ఇదిలా ఉండగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లను పిలిచి ముడుపుల కోసమే ఆ టెండర్లను రద్దు చేశారని ఆరోపించారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి తాము 89 శాతం పనులు పూర్తి చేయగా, నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి మిగిలిన 11 శాతం పనులను పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిధులు దిగమింగారని కాగ్ నివేదిక ఇచ్చిందని దానిపై చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అధికారులు, మంత్రులు, కార్యకర్తలు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. తాము అవినీతికి పాల్పడ్డామని భావిస్తే నాలుగేళ్లపాటు అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. చేతగాని దద్దమ్మలా వాళ్లు అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, మాజీ మంత్రి పి.సాంబశివరాజు, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి, బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.
చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణ