ఆంధ్రప్రదేశ్‌

రాజధాని పేరిట ఇష్టారాజ్యంగా అప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: ఏపీ రాజధాని అమరావతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఇష్టా రాజ్యంగా అప్పులు తెస్తున్నారని, తొలుత రూ. 2వేల కోట్లు విలువైన బాండ్లు విడుదల చేసి మరలా మరో రూ. 500కోట్లు విలువైన బాండ్లను విడుదల చేస్తామంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడలోని దాసరి భవన్‌లో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు తీర్చే అవకాశం లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పులు తీసుకొస్తున్నారని విమర్శించారు. బ్యాంకులు 6.5 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ ఇస్తుంటే చంద్రబాబు మాత్రం ఎక్కడా లేని విధంగా 10.32 శాతం వడ్డీ ఇస్తూ బాండ్లు విక్రయించారన్నారు. దీని వలన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నారు. విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన ఏపీకి రూ.94వేల కోట్ల అప్పులు వస్తే నాలుగేళ్లలో దానిని రూ. 2.49 లక్షల కోట్లకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని నిర్మాణాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా అప్పులు చేస్తున్నారన్నారు. రాజధాని కోసం 50వేల ఎకరాలు భూమి సేకరించారని, అయితే వాటిని సింగపూర్ కంపెనీల కోసం కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులను కొజ్జాలు అంటుంటే, పోలీసులు నీ నాలుక కోస్తామని జేసీను హెచ్చరిస్తున్నారన్నారు. నాలుగేళ్లలో పోలీసులను ఏనాడు స్వచ్ఛందంగా పని చేయనీయలేదని, ఊడిగం చేయించుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించేందుకు కనీసం వెయ్యి కోట్ల రూపాయలు సమకూర్చాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాలకు సీపీఐ మద్దతు తెలుపుతోందన్నారు. సమావేశంలో సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.